Share News

Pharma Litigation: వెగోవీ పేటెంట్‌పై నోవో నార్డిస్క్‌ మౌనం

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:02 AM

బరువు తగ్గించే (వెయిట్‌ లాస్‌) బ్లాక్‌బస్టర్‌ ఔషధం ‘వెగోవీ’ పేటెంట్‌ హక్కులపై డెన్మార్క్‌ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్‌ ఏ మాత్రం నోరు మెదపడం లేదు. వెగోవీ జెనరిక్‌ వెర్షన్‌ తయారు చేయడం నోవో నార్డిస్క్‌ పేటేంట్‌ హక్కులకు ఏ మాత్రం...

Pharma Litigation: వెగోవీ పేటెంట్‌పై నోవో నార్డిస్క్‌ మౌనం

న్యాయస్థానం ఆదేశాలపైనా నిర్లక్ష్యం

కోర్టుకు విన్నవించిన నాట్కో ఫార్మా

న్యూఢిల్లీ: బరువు తగ్గించే (వెయిట్‌ లాస్‌) బ్లాక్‌బస్టర్‌ ఔషధం ‘వెగోవీ’ పేటెంట్‌ హక్కులపై డెన్మార్క్‌ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్‌ ఏ మాత్రం నోరు మెదపడం లేదు. వెగోవీ జెనరిక్‌ వెర్షన్‌ తయారు చేయడం నోవో నార్డిస్క్‌ పేటేంట్‌ హక్కులకు ఏ మాత్రం భంగం కాదని నాట్కో ఫార్మా ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో దీనికి సమాధానం ఇవ్వాలని కోర్టు.. నోవో నార్డి్‌స్కను ఆదేశించింది. కొన్ని నెలలుగా దీనికి సమాధానం ఇవ్వాలని కోరుతున్నా ఈ డెన్మార్క్‌ కంపెనీ నుంచి ఉలుకూపలుకూ లేదని నాట్కో ఫార్మా న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో నోవో నార్డిస్క్‌ కావాలనే జాప్యం చేస్తోందని భావిస్తున్నారు.

ఎందుకంటే ?

నోవో నార్డి్‌స్కతో పాటు అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ.. భారత మార్కెట్లోకి తమ పేటెంటెడ్‌ వెయిట్‌ లాస్‌ ఔషధాలను ఇటీవలే విడుదల చేశాయి. నెలకు రూ.17,000 నుంచి రూ.26,000 ఖర్చవుతున్నా, సంపన్న వర్గాల నుంచి వీటికి మంచి డిమాండ్‌ ఉంది. అయితే మన దేశంలో ఈ ఔషధాల పేటెంట్‌ వచ్చే ఏడాది మార్చితో తీరిపోనుంది. దీంతో జెనరిక్‌ వెర్షన్‌లో ఈ వెయిట్‌ లాస్‌ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు నాట్కో ఫార్మా, డాక్టర్‌ రెడ్డీ్‌సతో సహా ఏడు దేశీయ ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ కంపెనీల ప్రయత్నాలను ఆలస్యం చేసేందుకు నోవో నార్డిస్క్‌ ఇలా మౌనం పాటిస్తోందని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.700 కోట్లుగా ఉన్న భారత ఒబేసిటీ ఔషధ మార్కెట్‌ 2030 నాటికి రూ.8,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 05:02 AM