NALCO Nellore Project: నెల్లూరు ప్రాజెక్టు గిట్టుబాటు కాదు నాల్కో
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:57 AM
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో తలపెట్టిన మరో పారిశ్రామిక ప్రాజెక్టు అటకెక్కింది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో ఏటా 60,000 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో తలపెట్టిన మరో పారిశ్రామిక ప్రాజెక్టు అటకెక్కింది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో ఏటా 60,000 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన ఉత్కర్ష్ అల్యూమినియం ధాతు నిగం ప్రాజెక్టు ఆర్థికంగా గిట్టుబాటు కాదని నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) తేల్చింది. కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో ఈ విషయం పేర్కొంది. కీలక మిశ్రమ లోహాల కోసం మరో ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రధాతు నిగమ్‌తో కలిసి నాల్కో ఈ ప్రాజెక్టును తలపెట్టింది. ఇందుకోసం 2019లో చెరి సగం వాటాతో ఉత్కర్ష్ అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ పేరుతో ప్రత్యేక జాయిం ట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేశారు. నాల్కో తాజా నివేదికతో నెల్లూరు జిల్లాలో తలపెట్టిన ఈ భారీ ప్రభు త్వ రంగ ప్రాజెక్టు కూడా దుగ్గరాజపట్నం ఓడ రేవులా అటకెక్కింది.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి