Missed ITR Penalty: ఐటీఆర్ దాఖలు గడువు మిస్ అయితే ఏం చేయాలి..జరిమానా ఎంత
ABN , Publish Date - Sep 03 , 2025 | 07:33 AM
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 15, 2025 వరకు మీ పన్ను రిటర్న్ ఫైల్ చేయాల్సిన ఆఖరి తేదీ. అయితే ఈ గడువు మిస్ అయితే ఏం చేయాలి, జరిమానాతో ఫైల్ చేయవచ్చా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఐటీఆర్ దాఖలుకు గడువు దగ్గర పడుతోంది. మిస్ అయితే మాత్రం జరిమానాలు తప్పవు. ఇంకా 13 రోజులే మిగిలి ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే గడువు సెప్టెంబర్ 15, 2025 వరకు ఉంది. దీని అసలు గడువు జూలై 31 నుంచి పొడిగించారు. మీ ఆదాయాన్ని ప్రస్తుత టైంలో డిక్లేర్ చేయకపోతే జరిమానాలు తప్పవు. అయినా కూడా ఆలస్యంగా కూడా ఫైల్ చేసుకోవచ్చు.
ఐటీఆర్ మిస్ చేస్తే..
సెప్టెంబర్ 15 గడువు మిస్ అయినా కూడా, మీరు డిసెంబర్ 31, 2025లోపు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ దాఖలు చేయవచ్చు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 139(4) కింద అనుమతించబడుతుంది. కానీ జరిమానా మాత్రం విధించబడుతుంది. ఈ జరిమానా మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. మీ ఆదాయం రూ.5 లక్షలకు మించితే గరిష్టంగా రూ.5,000. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే గరిష్టంగా రూ.1,000 ఫైన్ విధిస్తారు. ఉదాహరణకు మీ ఆదాయం రూ.3 లక్షలు అయితే, మీరు డిసెంబర్ 31 లోపు రిటర్న్ ఫైల్ చేస్తే రూ.1,000 చెల్లించాలి. మీ ఆదాయం రూ.7 లక్షలు అయితే రూ.5,000 చెల్లించాలి.
గడువు మిస్ అయితే ఏం చేయాలి?
గడువు మిస్ అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. డిసెంబర్ 31 లోపు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేయవచ్చు.
దీనికోసం మీ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. ఫారమ్-16, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్ వివరాలు, ఇతర ఆదాయ వనరుల సమాచారం సేకరించండి.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ (www.incometax.gov.in) ద్వారా సులభంగా రిటర్న్ ఫైల్ చేయవచ్చు.
ఫైలింగ్ సమయంలో జరిమానా రుసుము కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీకు గందరగోళంగా అనిపిస్తే, చార్టెడ్ అకౌంటెంట్ సాయం తీసుకోవచ్చు.
స్మార్ట్ ఫైలింగ్
ఈ సంవత్సరం ఐటీఆర్ ఫారమ్‌లలో మార్పులు జరిగాయి. మీకు సరిపడే ఫారమ్ (ITR-1, ITR-2, మొదలైనవి) ఎంచుకోండి
రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఈ వెరిఫై చేయడం మర్చిపోవద్దు. ఆధార్ OTP లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-వెరిఫికేషన్ సులభం
కుదిరితే వచ్చే గడువుకు ముందే ఫైల్ చేయడానికి ప్లాన్ చేయండి. జరిమానా లేకుండా ఉంటుంది.
ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేస్తే ఏమవుతుంది
రిఫండ్ ఆలస్యంగా వస్తుంది
కొన్ని డెడక్షన్‌లు వర్తించకపోవచ్చు
క్రెడిట్ స్కోర్‌లపై ప్రభావం
ఎవరైనా లోన్ అప్లై చేసినపుడు ఐటీఆర్ తప్పనిసరి కావచ్చు
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి