MG Select Experience Center: హైదరాబాద్‌లో ఎంజీ సెలెక్ట్
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:07 AM
జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా హైదరాబాద్‌లో ఎంజీ సెలెక్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. బంజారాహిల్స్‌లో ఏర్పా టు చేసిన ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను...
ఎంజీ సైబర్‌స్టర్, ఎం9 ఎలక్ట్రిక్ కార్లను
ఆవిష్కరించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా హైదరాబాద్‌లో ఎంజీ సెలెక్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. బంజారాహిల్స్‌లో ఏర్పా టు చేసిన ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కంపెనీ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఎంజీ సైబర్‌స్టర్, ఎంజీ ఎం9 లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత్ చమురు దిగుమతులను తగ్గించుకోవాలంటే దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సి ఉందన్నారు. ఇంధన స్వయం సమృద్ధిని సాధించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు దోహదపడతాయన్నారు. దేశీయంగా పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని వివరించారు. కాగా హైదరాబాద్ మార్కెట్లోకి ఎంజీ స్పోర్ట్స్‌కారు సైబర్‌స్టర్, ఎం9 కార్లను విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని ఎంజీ సెలెక్ట్ హెడ్ మిలింద్ షా అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 14 ఎంజీ సెలెక్ట్ సెంటర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో సైబర్‌స్టర్, ఎం9 కార్లకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఇప్పటికే 250 కార్లు బుకింగ్స్ కావటమే ఇందుకు నిదర్శనమని ఎంజీ సెలెక్ట్ జయలక్మీ మోటార్స్ ఇండియా డీలర్ ప్రిన్సిపల్ పీ గౌతమ్ సాయి తెలిపారు. ఎంజీ సైబర్‌స్టర్ ఒకసారి చార్జింగ్‌తో 580 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని ధర రూ.74.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్). అయితే ప్రీ బుకింగ్స్ కోసం పరిచయ ధర రూ.72.49 లక్షలుగా ఖరారు చేసింది. ఎంజీ ఎం9 ధర రూ.69.90 లక్షలుగా ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
For More National News and Telugu News