Share News

Megha Engineering Bags: మేఘాకు మరో భారీ ఆర్డర్‌

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:14 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. కర్ణాటకలోని పాదూరు వద్ద 25 లక్షల టన్నుల...

 Megha Engineering Bags: మేఘాకు మరో భారీ ఆర్డర్‌

కర్ణాటకలో ‘వ్యూహాత్మక’ పెట్రో ప్రాజెక్టు

న్యూఢిల్లీ:హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. కర్ణాటకలోని పాదూరు వద్ద 25 లక్షల టన్నుల వ్యూహాత్మక ముడి చమురు నిల్వల కేంద్రాన్ని ఏర్పాటు చేసే కాంట్రాక్టు దక్కించుకున్నట్టు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. ఈ కాంట్రాక్ట్‌ విలువ రూ.5,700 కోట్లు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంఈఐఎల్‌ త్వరలోనే ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్‌ లిమిటెడ్‌ (ఐఎ్‌సపీఆర్‌ఎల్‌)తో ఒప్పం దం చేసుకోనుందని సమాచారం. ఎంఈఐఎల్‌తో పాటు మరో రెండు కంపెనీలు కూడా ఈ ప్రాజెక్టు కోసం పోటీపడ్డాయి. అయితే మేఘా ఇంజనీరింగ్‌ కోట్‌ చేసిన ధర తక్కువగా ఉండటంతో ఐఎ్‌సపీఆర్‌ఎల్‌.. ఈ ప్రాజెక్టును ఎంఈఐఎల్‌కే కట్టబెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఎ్‌సపీఆర్‌ఎల్‌ ఈ తరహా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక ప్రైవేట్‌ కంపెనీకి అప్పగించడం ఇదే మొదటిసారి. ఐఎ్‌సపీఆర్‌ఎల్‌ ఇప్పటికే విశాఖపట్నం, మంగళూరు, పాదూరు వద్ద మూడు వ్యూహాత్మక ముడి చమురు నిల్వల కేంద్రాలను నిర్వహిస్తోంది. పాదూరు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌కు అప్పగించబోతోంది. ఈ విస్తరణతో దేశ వ్యూహాత్మక చమురు నిల్వల సామర్ధ్యం 53.3 లక్షల టన్నులకు చేరనుంది. ఈ నిల్వలు అత్యవసర పరిస్థితుల్లో ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల అవసరాలకు సరిపోతాయి.

ప్రాజెక్టు ప్రత్యేకతలు

  • ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలి

  • 60 ఏళ్ల పాటు మేఘాకు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు

  • 25 లక్షల టన్నుల వరకు ముడి చమురు నిల్వ

  • చమురు నిల్వల సదుపాయాన్ని మేఘా సొంతంగా లేదా ఇతరులకు అద్దెకు ఇవ్వడం చేయవచ్చు

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 05:14 AM