Meesho IPO: మీషో ఐపీఓకు రెడీ.. డిసెంబర్ 3 నుంచి అందుబాటులోకి.. పూర్తి వివరాలివే..
ABN , Publish Date - Nov 28 , 2025 | 07:26 PM
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు సిద్ధమవుతోంది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతు కలిగిన మీషో 5, 421 కోట్ల రూపాయల ఐపీఓ డిసెంబర్ 3 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి రానుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 5తో పూర్తి కాబోతోంది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు సిద్ధమవుతోంది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతు కలిగిన మీషో 5, 421 కోట్ల రూపాయల ఐపీఓ డిసెంబర్ 3 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి రానుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 5తో పూర్తి కాబోతోంది. మీషో ఒక్కో షేర్ ధరల శ్రేణిని రూ.105-111గా సంస్థ నిర్ణయించింది. ఇష్యూ చేయబోతున్న గరిష్ట ధరతో పోల్చి చూస్తే ఇది రూ.50, 096 కోట్ల విలువతో పబ్లిక్ ఇష్యూకు రానుంది (Meesho GMP).
డిసెంబర్ 2న యాంకర్ ఇన్వెస్టర్లకు విండో తెరుచుకుంటుంది. 3వ తేదీన పూర్తి స్థాయి సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి వస్తుంది. డిసెంబర్ ఐదుతో ఐపీఓ పీరియడ్ పూర్తవుతుంది. డిసెంబర్ 12న కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్ అవుతాయి. ఐపీఓలో భాగంగా రూ.4, 250 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా సంస్థ జారీ చేస్తుంది. రూ.1, 771 కోట్ల విలువైన 10.55 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించబోతోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, పది శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు (Meesho IPO subscription).
కాగా, మీషోలో పెట్టుబడులు పెట్టిన ఎలివేషన్ పీక్ ఎక్స్‌వీ, వెంచ్ హైవే, వై కాంబినేటర్ వంటి సంస్థలు ఆఫర్ ఫల్ సేల్ ద్వారా తమ షేర్లను విక్రయిస్తున్నాయి (Meesho price band). పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను క్లౌడ్ ఇన్‌ఫ్రా, మార్కెటింగ్, ఇన్ ఆర్గానిక్ గ్రోత్ పెంచుకోవడం, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్, కార్పొరేట్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం వినియోగించనున్నారు. ఈ ఐపీఓపై మదుపర్లలో మంచి ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మీషో ఒక్కో షేర్ రూ.140 వద్ద లిస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి:
వరుస లాభాలకు బ్రేక్..ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
త్వరలో బంగారం రుణాల్లోకి పిరామల్ ఫైనాన్స్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి