MCX Gold Price: బంగారంపై పెట్టుబడి చేయాలా వద్దా.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
ABN , Publish Date - Sep 16 , 2025 | 02:01 PM
బంగారం ఆభరణాల కోసం మాత్రమే కాదు, పెట్టుబడి చేయాలని చూస్తున్న వారికి కూడా మంచి ఎంపికగా ఉంటుంది. అయితే ప్రస్తుతం దీని ధరలు ఎలా ఉన్నాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
బంగారం అంటే సిరిసంపదకు ప్రతీక మాత్రమే కాదు. పెట్టుబడి రూపంగా కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. పండుగలు, వివాహాలు, ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తే ఆకర్షణగా మారే బంగారం, ఆర్థిక భవిష్యత్తుకు సంపదగా మారుతోంది. నేటి పరిస్థితే చూస్తే, మార్కెట్‌లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పైపైకి చేరుతున్నాయి.
అంతర్జాతీయ ప్రభావాలు, డాలర్ మారకం విలువ, స్థానిక డిమాండ్ వంటి అనేక అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడి చేసేందుకు చూస్తున్నవారు తాజా ధరలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధర ఎంత ఉంది? గతంతో పోల్చితే ధరల పెరుగుదల ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సెప్టెంబర్ 16, 2025న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో బంగారం ధరలు కొంచెం పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 17న తీసుకోబోయే ద్రవ్య విధాన నిర్ణయంపై అందరి ఫోకస్ ఉంది. డాలర్ విలువ తగ్గడం, ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల (bps) వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు బంగారం ధరలకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర $3,686.12కి చేరింది. ఇది మునుపటి రోజుకు 0.18 శాతం పెరుగుదల.
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా
MCX బంగారం అక్టోబర్ ఫ్యూచర్స్: ఉదయం 9:50 గంటల సమయంలో 10 గ్రాములకు రూ.1,10,229 వద్ద 0.05 శాతం పెరుగుదల.
MCX వెండి డిసెంబర్ ఫ్యూచర్స్: కిలోగ్రాముకు రూ.1,29,630 వద్ద 0.16 శాతం పెరుగుదల.
ఫెడ్ రేటు తగ్గింపులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, టారిఫ్‌లకు సంబంధించిన అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు కొత్త గరిష్టాలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి, దీర్ఘకాలంలో లాభాలు పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి