NSE by Cyber Attacks: రోజుకు 17 కోట్ల సైబర్ దాడులు
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:10 AM
దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలపైనా సైబర్ కేటుగాళ్లు కన్నేశారు. తమ డేటా బ్యాంకుల్లోకి జొరబడి కీలక సమాచారం తస్కరించేందుకు లేదా తమ కార్యకలాపాలను స్తంభింప చేసేందుకు సైబర్ కేటుగాళ్లు...
ముంబై: దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలపైనా సైబర్ కేటుగాళ్లు కన్నేశారు. తమ డేటా బ్యాంకుల్లోకి జొరబడి కీలక సమాచారం తస్కరించేందుకు లేదా తమ కార్యకలాపాలను స్తంభింప చేసేందుకు సైబర్ కేటుగాళ్లు రోజుకు 15 కోట్ల నుంచి 17 కోట్ల సార్లు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) అధికారులు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అయితే ఈ రోజువారీ దాడుల సంఖ్య 40 కోట్లకు చేరింది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్, యంత్రాలు, సుశిక్షుతులైన సైబర్ నిపుణులతో ఈ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతున్నట్టు తెలిపారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు తమ సైబర్ యోధులు 24 గంటలూ అప్రమత్తంగా ఉన్నట్టు వారు చెప్పారు.
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. గోల్డ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఓఎ్‌ఫ)ను ప్రారంభించింది. ఇది కోటక్ గోల్డ్, సిల్వర్ ఈటీఎ్‌ఫకు చెందిన ఓపెన్ ఎండెడ్ ఎఫ్‌ఓఎఫ్. దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాల కోసం ఈ ఫండ్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.100. ముగింపు తేదీ ఈ నెల 20.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News