Bhargava Urges India: ట్రంప్ బెదిరింపులకు లొంగొద్దు
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:56 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై భారత కార్పొరేట్ వర్గాల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఈ బెదిరింపులకు ఏ మాత్రం లొంగకూడదని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) చైర్మన్ ఆర్‌సీ భార్గవ ప్రభుత్వాన్ని కోరారు...
మన గౌరవ మర్యాదలే ముఖ్యం
జీఎ్‌సటీ తగ్గిస్తే చిన్న కార్లకు మేలే
మారుతి సుజుకీ చైర్మన్ భార్గవ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై భారత కార్పొరేట్ వర్గాల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఈ బెదిరింపులకు ఏ మాత్రం లొంగకూడదని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) చైర్మన్ ఆర్‌సీ భార్గవ ప్రభుత్వాన్ని కోరారు. వాణిజ్యం కంటే దేశ గౌరవ మర్యాదలే ముఖ్యమన్నారు. ఈ కీలక సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలవాలని కోరారు. మారుతి సుజుకీ ఇండియా వాటాదారుల 44వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఉద్దేశించి మాట్లాడుతూ భార్గవ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి ట్రంప్ సుంకాల పోటే కారణమన్నారు. దౌత్య సంబంధాల్లో సుంకాలను ఆయుధంగా ఉపయోగిస్తున్న తొలి నేత ట్రంపేనని భార్గవ విమర్శించారు. భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ).. అమెరికాతో సహా ఇతర దేశాలతో కుదుర్చుకునే ఎఫ్‌టీఏలకు ప్రాతిపదికగా ఉండాలని భార్గవ స్పష్టం చేశారు. రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరాపై చైనా ఆంక్షలను ఒక హెచ్చరికగా తీసుకోవాలని కోరారు.
చిన్న కార్లకు మేలు: ప్రతిపాదిత జీఎ్‌సటీ సంస్కరణలపైనా భార్గవ మాట్లాడుతూ.. ఈ సంస్కరణలు జీడీపీ వృద్ధి రేటు, ఉపాధి కల్పన వేగం పుంజుకునేందుకు దోహదం చేస్తాయన్నారు. ఈ సంస్కరణల్లో భాగంగా చిన్న కార్లపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎ్‌సటీ.. 18 శాతానికి తగ్గుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉందన్నారు. చిన్న కార్లపై జీఎ్‌సటీ 18 శాతానికి తగ్గిస్తే ఈ తరగతి కార్ల మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందన్నారు. ప్రస్తుతం తమ ప్రయాణాల కోసం స్కూటర్లు, బైకులపై ఆధారపడిన అనేక మంది చిన్న కార్లు కొనేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. జపాన్ అనుభవమే ఈ విషయంలో మనకు ఆదర్శమన్నారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి