Stock Market: మళ్లీ 82000 పైకి సెన్సెక్స్
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:58 AM
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఆరో రోజూ లాభాల్లో పయనించాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 373.33 పాయింట్లు ఎగబాకి 82,231.17 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ...
ఆరో రోజూ లాభాల్లోనే సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఆరో రోజూ లాభాల్లో పయనించాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 373.33 పాయింట్లు ఎగబాకి 82,231.17 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 142.87 పాయింట్ల లాభంతో 82,000.71 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.20 పాయింట్ల వృద్ధితో 25,083.75 వద్ద స్థిరపడింది. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 13 రాణించాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ స్టాక్స్ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ 0.90 శాతం వరకు పెరిగాయి.
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ రూ.5,000 కోట్ల
సమీకరణ: సెక్యూరిటీల జారీ ద్వారా ఒకేసారి లేదా పలు విడతల్లో రూ.5,000 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని 50.5 ఎకరాల స్థలంలో కార్గో సిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు కంపెనీకి పూర్తి అనుబంధ విభాగంగా ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎ్‌సపీవీ)ను ఏర్పాటు చేసేందుకూ బోర్డు అంగీకరించింది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి