Share News

Stock Market Outlook: ఈ వారం ఆటుపోట్లలోనే

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:23 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌ ఎగుమతులపై నిషేధం విధించిన చైనాపై డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్స్‌ విధించటం, ఇతర అంతర్జాతీయ రాజకీయ...

Stock Market Outlook: ఈ వారం ఆటుపోట్లలోనే

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌ ఎగుమతులపై నిషేధం విధించిన చైనాపై డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్స్‌ విధించటం, ఇతర అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు సూచీలపై ప్రభావం చూపించే వీలుంది. ఈ నేపథ్యంలో మదుపరులు ఎంపిక చేసుకున్న స్టాక్స్‌లోనే పెట్టుబడి పెట్టడం మంచిది. గత వారం నిఫ్టీ దాదాపు 2 శాతం మేర పెరిగి 25,285 పాయింట్ల వద్ద క్లోజైంది. సూచీ ఇదే స్థాయిల్లో కొన్నాళ్లు కన్సాలిడేట్‌ అయితే స్థిరత్వం వస్తుంది. ప్రస్తుతం నాన్‌ ఫెర్రస్‌ మెటల్స్‌, టెలికాం, వజ్రాభరణాలు, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌ రంగాలు బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

డీఎల్‌ఎఫ్‌: కొన్ని నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. కన్సాలిడేషన్‌ కూడా జరుగుతోంది. ప్రస్తుతం కీలకమైన రూ.706 వద్ద మద్దతు లభించింది. స్వల్పకాల అప్‌ట్రెండ్‌ కొనసాగే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.740 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.825 టార్గెట్‌ ధరతో రూ.740 శ్రేణిలో డిప్స్‌ పద్దతిలో అక్యుములేట్‌ చేసుకోవాలి. రూ.720 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ: కొన్ని నెలలుగా కన్సాలిడేట్‌ అవుతున్న ఈ షేరు ప్రస్తుతం స్వలకాలిక అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగవుతోంది. ఫండమెంటల్స్‌ బాగున్నాయి. గత శుక్రవారం రూ.1,064 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,040 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,180 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,010 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

డాక్టర్‌ రెడ్డీస్‌: స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కౌంటర్‌లో ట్రయాంగిల్‌ ప్యాటర్న్‌ ఫామ్‌ అయ్యింది. ప్రైస్‌ యాక్షన్‌ టైట్‌గా సాగుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.1,264 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,250 శ్రేణిలో ప్రవేశించి రూ.1,4,50 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,220 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


పవర్‌గ్రిడ్‌: ప్రస్తుతం ఈ కౌంటర్‌ టర్న్‌ అరౌండ్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. షార్ట్‌టర్మ్‌ వ్యూహం తో ఇందులో పొజిషన్‌ తీసుకోవచ్చు. గత శుక్రవారం రూ.289 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో రూ.280 పై స్థాయిలో ప్రవేశించి రూ.315/330 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.270 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బజాజ్‌ ఆటో: జీవిత కాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 45 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం స్టేజ్‌-2లో ఉంది. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగం మూమెంటమ్‌లో ఉంది. గత శుక్రవారం రూ.8,946 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.8,850 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.9,500 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.8,750 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 05:23 AM