Kotak Mahindra Bank: కోటక్ బ్యాంక్ లాభం రూ 3253 కోట్లు
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:44 AM
సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) కోటక్ మహీంద్రా బ్యాంక్.. స్టాండ్‌ఎలోన్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 3 శాతం తగ్గి రూ.3,253 కోట్లుగా నమోదైంది...
న్యూఢిల్లీ: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) కోటక్ మహీంద్రా బ్యాంక్.. స్టాండ్‌ఎలోన్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 3 శాతం తగ్గి రూ.3,253 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,344 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.16,239 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.13,649 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) మాత్రం 4.54 శాతానికి తగ్గింది. కాగా బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.39 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.32 శాతానికి తగ్గాయి.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి