Share News

కియా నుంచి కారెన్స్‌ క్లావిస్‌

ABN , Publish Date - May 09 , 2025 | 04:46 AM

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా.. తన పాపులర్‌ కారు కారెన్స్‌లో ప్రీమియం వెర్షన్‌ ‘కారెన్స్‌ క్లావిస్‌’ను గురువారం ఆవిష్కరించింది. భారత్‌ నుంచే అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ కారును...

కియా నుంచి కారెన్స్‌ క్లావిస్‌

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా.. తన పాపులర్‌ కారు కారెన్స్‌లో ప్రీమియం వెర్షన్‌ ‘కారెన్స్‌ క్లావిస్‌’ను గురువారం ఆవిష్కరించింది. భారత్‌ నుంచే అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ కారును విడుదల చేసినట్లు కియా ఇండియా హెడ్‌ హర్దీప్‌ సింగ్‌ బ్రార్‌ వెల్లడించారు. దేశీయ మార్కెట్లో ఎంపీవీ, ఎస్‌యూవీ 7 సీట్ల విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోడల్‌ను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రీమియం ఫీచర్లు, మూడు వరుసల్లో సీటింగ్‌ సహా మరికొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో కారెన్స్‌ క్లావి్‌సను రూపొందించినట్లు ఆయన తెలిపారు. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌తో పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. ఈ కారు బుకింగ్స్‌ను కియా ఇప్పటికే ప్రారంభించగా ధరను మాత్రం నెలాఖరులో ప్రకటించనుంది. కారెన్స్‌ విడుదల చేసిన మూడేళ్లలోనే 2 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగు లీ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి

Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌.. సిద్ధమైన క్షిపణులు..

Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి

Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Read Latest International News And Telugu News

Updated Date - May 09 , 2025 | 04:46 AM