Share News

2024 25 ఆర్థిక సంవత్సరం లావాదేవీలను సరి చేసుకోవటం ఎలా

ABN , Publish Date - May 18 , 2025 | 01:55 AM

ఈ మార్చితో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఇప్పటి వరకు వివిధ రకాల రిటర్నులు దాఖలు చేసినప్పటికీ, వార్షిక రిటర్న్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇన్‌కమ్‌ టాక్స్‌కి సంబంధించిన రిటర్నులు కూడా...

2024 25 ఆర్థిక సంవత్సరం లావాదేవీలను సరి చేసుకోవటం ఎలా

ఈ మార్చితో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఇప్పటి వరకు వివిధ రకాల రిటర్నులు దాఖలు చేసినప్పటికీ, వార్షిక రిటర్న్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇన్‌కమ్‌ టాక్స్‌కి సంబంధించిన రిటర్నులు కూడా దాఖలు చేయాల్సి ఉంది. కాబట్టి ముందుగా వ్యాపార సంస్థలు తమ అన్ని రకాలైన లావాదేవీలను మరొకసారి సరి చూసుకోవాలి. పొరపాట్లు ఏమైనా ఉంటే వార్షిక రిటర్న్‌లో లేదా ఈలోపు గానీ సరి చేసుకోవచ్చు. నిబంధనల మేర కొంతమందికి వార్షిక రిటర్నుల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలను సరిచేసుకోవటం అందరికీ అవసరం. వీటికి సంబంధించిన ముఖ్య విషయాలు మీకోసం..

మొదటగా, అమ్మకాల విషయాన్ని పరిశీలించాలి. బుక్స్‌లో చూపిన అమ్మకాలు, మీరు దాఖలు చేసిన జీఎ్‌సటీఆర్‌-1, జీఎ్‌సటీఆర్‌-3బీ రిటర్నుల్లో చూపిన అమ్మకాలతో సరిపోతున్నాయా లేదా చూడాలి. అలాగే జీఎ్‌సటీఆర్‌-1, జీఎ్‌సటీఆర్‌-3బీ మధ్య లావాదేవీల్లో ఏమైనా తేడాలున్నాయో చూసుకోవాలి. అన్ని ఇన్వాయి్‌సలు, క్రెడిట్‌/డెబిట్‌ నోట్స్‌ రిటర్నుల్లో చూపబడ్డాయా లేదా ధ్రువీకరించుకోవాలి. రాష్ట్ర అంతర్గత సరఫరాలు, అంతర్‌ రాష్ట్ర సరఫరాలు సరిగ్గా చూపారా.. అంటే ప్లేస్‌ ఆఫ్‌ సప్లయ్‌ సరిగ్గా చూపించారా నిర్ధారించుకోవాలి.


ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) విషయానికొస్తే.. జీఎ్‌సటీఆర్‌-2బీ లో కనిపించే ఇన్వాయి్‌సల ఆధారంగానే ఐటీసీ తీసుకోవాలి. అలాగే అర్హత ఉన్న మేరకే (జీఎ్‌సటీఆర్‌-2బీ లో కనిపించినప్పటికీ) ఐటీసీ తీసుకోవాలి. ముఖ్యంగా పొందిన సరఫరాలలో వ్యక్తిగత వినియోగం కోసం లేదా వ్యాపారేతర అవసరాల కోసం ఏమైనా వాడితే ఆ మేరకు ఐటీసీ తీసుకోరాదు. అలాగే ఫుడ్‌, వాహనాలు, ఉద్యోగుల ఇన్సూరెన్స్‌ లాంటి వాటిని వ్యాపార అవసరాల కోసం వాడినప్పటికీ ఐటీసీ కోసం అదనపు నిబంధనలు పొందుపరచటం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటి మీద ఐటీసీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అర్హత ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. కామన్‌ ఇన్‌పుట్స్‌ను పన్ను చెల్లించే సరఫరాలు, పన్ను మినహాయింపు పొందిన సరఫరాలకు వాడినట్లయితే సంబంధిత నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు పొందిన సరఫరాల మేరకు రివర్స్‌ చేయాలి. ముఖ్యంగా 180 రోజుల లోపు సరఫరాదారులకు సంబంధిత మొత్తం చెల్లించని బిల్లులపై ఐటీసీ రివర్స్‌ చేయాలి.

జీఎ్‌సటీ క్యాష్‌, క్రెడిట్‌ లెడ్జర్లు కూడా బుక్స్‌తో పోల్చుకుని ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయేమో చూడాలి. చెల్లించాల్సిన పన్నుకు, చెల్లించిన పన్నుకు మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయో గమనించాలి. ఇంకా, పన్ను చెల్లింపులు నిర్ధారిత సమయంలో అంటే ‘టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌’ నిబంధనల మేర జరిగినట్లు ధ్రువీకరించుకోవాలి. ముఖ్యంగా సర్వీ్‌సల విషయంలో అడ్వాన్సులు పొందినప్పుడు లేదా ఇన్వాయి్‌సలు తదుపరి నెలలో ఇచ్చినప్పుడు పన్ను చెల్లింపులను జాగ్రత్తగా చూసుకోవాలి.


రివర్స్‌ చార్జీ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. లీగల్‌ ఫీజులు, డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌, సేవల దిగుమతులు వంటి వాటిపై జీఎ్‌సటీ చెల్లించి ఆ మేరకు ఐటీసీ క్లెయిమ్‌ చేశారా లేదా తెలుసుకోవాలి. బుక్స్‌లో చేసిన ఎంట్రీలు, రిటర్నుల్లో చూపిన ఆర్‌సీఎం వివరాలతో సరిపోతున్నాయా ధ్రువీకరించుకోవాలి.

క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్స్‌ జారీ విషయంలో, సంబంధిత పన్ను, ఐటీసీ సర్దుబాట్లు నిబంధనల మేర జరిగేటట్లు చూసుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే అమ్మకాలు, ఐటీసీ, ఆర్‌సీఎం, లెడ్జర్లు, వివాదాలకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి ఖాతాలకు తుది రూపమివ్వటం వల్ల పన్నులపరంగా సమస్యలు, వివాదాలు రానివ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులకు, జీఎ్‌సటీ రిటర్నులకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 01:55 AM