IPO Market India 2025: ఐపీఓ మార్కెట్లో జోష్
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:03 AM
ఐపీఓ మార్కెట్లో జోష్ కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలి వారంలోగా మరో 12 కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి...
30లోగా మరో 12 ఐపీఓలు
న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్లో జోష్ కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలి వారంలోగా మరో 12 కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ కంపెనీలన్నీ దాదాపు రూ.10,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్‌కు రాబోతున్నాయి . ఇందులో ఆనంద్ రాఠి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఇష్యూ కూడా ఉంది. ఈ కంపెనీల ఈ నెల 15 నుంచి తమ షేరు ధర శ్రేణిని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సెబీ ఇప్పటికే ఈ ఐపీఓలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూలధన అవసరాలు, అప్పుల చెల్లింపు, ఇతర అవసరాల కోసం ఈ కంపెనీలు ఐపీఓ మార్కెట్‌కు వస్తున్నాయి.
ఇప్పటి వరకు రూ.75,000 కోట్లు : ఈ సంవత్సరం ఇప్పటి వరకు 55 కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్ నుంచి దాదాపు రూ.75,000 కోట్లు సమీకరించాయి. గత ఏడాది మొత్తం మీద 91 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.6 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైమరీ మార్కెట్‌లో ఈ జోష్ ఇలానే కొనసాగితే ఈ సంవత్సరం ఐపీఓల ద్వారా కంపెనీలు సమీకరించే మొత్తం రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని మార్కెట్ వర్గాల అంచనా.
మార్కెట్‌కు వచ్చే కొన్ని ప్రధాన ఐపీఓలు :
జైన్ రిసోర్స్ రిసైక్లింగ్ రూ.2,000 కోట్లు.
పార్క్ మెడివరల్డ్ రూ.1,260 కోట్లు.
సాత్విక్ గ్రీన్ ఎనర్జీ రూ.1,150 కోట్లు.
ట్రూఆల్ట్ బయోఎనర్జీ రూ.1,000 కోట్లు.
ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ రూ.750 కోట్లు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి