Share News

Infosys : ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బయ్యే వార్త చెప్పిన ఇన్ఫోసిస్

ABN , Publish Date - Aug 20 , 2025 | 06:10 PM

దేశంలో రెండవ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఎగిరిగంతేసే వార్త చెప్పింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి గానూ తమ ఉద్యోగులకు పని తీరు ఆధారిత బోనస్ భారీగా ప్రకటించింది.

Infosys : ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బయ్యే వార్త చెప్పిన ఇన్ఫోసిస్
Infosys

Infosys : దేశంలో రెండవ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఎగిరిగంతేసే వార్త చెప్పింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి గానూ తమ ఉద్యోగులకు పని తీరు ఆధారిత బోనస్ భారీగా ప్రకటించింది. అర్హులైన వారికి సగటున 80 శాతం మేర ఈ బోనస్ చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు నెల వేతనంతోనే ఈ మొత్తం చెల్లిస్తామని కూడా తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గతంగా ఇ-మెయిల్స్, మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తున్నట్లు సమాచారం.


పీఎల్ 4 లెవల్ ఉద్యోగుల్లో అత్యుత్తమ పని తీరు కనబరిచిన ఉద్యోగులకు అత్యధికంగా 89 శాతం మేర బోనస్ చెల్లిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇక టార్గెట్స్ రీచ్ అయిన ఎంప్లాయిస్‌కు 80 శాతం వరకు బోనస్ చెల్లింపులు ఉంటాయని వెల్లడించింది.

పీఎల్ 5 లెవల్ ఉద్యోగులకు 78 శాతం నుంచి 87 శాతం మధ్య, పీఎల్ 6 లెవెల్ ఉద్యోగులకు 75 నుంచి 85 శాతం మధ్య బోనస్ చెల్లింపులు ఉంటాయని చెప్పింది. అలాగే పీఎల్ 4, పీఎల్ 5, పీఎల్ 6 కేటగిరీల్లో ఉన్న దృష్టి సారించాల్సిన ఉద్యోగులకు సైతం వరుసగా 80 శాతం, 75 శాతం, 70 శాతం మేర బోనస్ చెల్లింపులు ఉంటాయని తన ఇంటర్నల్ మెమోలో ఇన్ఫోసిస్ వెల్లడించింది. బోనస్ లెటర్లను తమ ఉద్యోగులకు ఇ-డాకెట్స్‌లో అప్లోడ్ చేస్తామని ఇన్ఫోసిస్ తెలియజేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..

సీఎంపై దాడి.. హైటెన్షన్!

యూరియాపై ఫలించిన ఎంపీల పోరాటం

For National News And Telugu News

Updated Date - Aug 20 , 2025 | 06:10 PM