Infosys Share Buyback: ఇన్ఫీ రూ 18000 కోట్ల బైబ్యాక్
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:14 AM
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ.18,000 కోట్ల విలువైన షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ మొత్తం పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో...
కంపెనీ వాటాలో 2.41ు వాటాకు సమానమైన 10 కోట్ల షేర్ల తిరిగి కొనుగోలు
ఒక్కో షేరుకు రూ.1,800 చెల్లింపు
కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద బైబ్యాక్
గడిచిన మూడేళ్లలో ఇదే మొదటిసారి
మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి ఐదోసారి
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ.18,000 కోట్ల విలువైన షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ మొత్తం పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 2.41 శాతానికి సమానమైన 10 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు, ఒక్కో షేరుకు రూ.1,800 చెల్లించనున్నట్లు తెలిపింది. గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు సభ్యులు ఈ బైబ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కాగా ఇన్ఫోసిస్ చరిత్రలో ఇదే అతిపెద్ద బైబ్యాక్ కానుంది. గడిచిన మూడేళ్లలో ఇదే మొదటిసారి. సంస్థ స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి ఇది ఐదోసారి.
బీఎ్‌సఈలో ఇన్ఫోసిస్ షేరు ధర గురువారం 1.51 శాతం తగ్గి రూ.1,509.5 వద్ద ముగిసింది. ఈ ముగింపు ధరతో పోలిస్తే కంపెనీ షేర్ల తిరిగి కొనుగోలు కోసం 19 శాతం అధికంగా చెల్లించనుంది. ఈ జూన్ త్రైమాసికం చివరినాటకి కంపెనీ 88.4 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,805 కోట్లు) ఫ్రీ క్యాష్‌ఫ్లోను నమోదు చేసింది. తాజా బైబ్యాక్ ప్రతిపాదనకు కంపెనీ వాటాదారులూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
సంవత్సరం రూ.కోట్లు మొత్తం ఒక్కో షేరు
ఎన్ని షేర్లు ధర (రూ.)
2017 13,000 11.3 కోట్లు 1,150
2019 8,260 11.05 కోట్లు 747
2021 9,200 5.58 కోట్లు 1,649
2022 9,300 6.04 కోట్లు 1,539
2025 18,000 10 కోట్లు 1,800
టీసీఎస్ కూడా ప్రకటిస్తుందా..?
ఇన్ఫోసిస్ తాజా నిర్ణయం నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్) కూడా షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించవచ్చని హాంకాంగ్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎ్‌సఏ అభిప్రాయపడింది. 2023 డిసెంబరుతో ముగిసిన బైబ్యాక్‌లో టీసీఎస్ రూ.17,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2022లో రూ.18,000 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఈ విడత టీసీఎస్ రూ.20,000 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చని సీఎల్‌ఎ్‌సఏ అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
For More National News and Telugu News