Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Oct 06 , 2025 | 09:49 AM
బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీలను లాభాల బాట పట్టిస్తున్నాయి. ఈ రెండు రంగాల్లోని పలు స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీలను లాభాల బాట పట్టిస్తున్నాయి. ఈ రెండు రంగాల్లోని పలు స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఐపీవో జోష్ కూడా సూచీలను ముందుకు నడిపిస్తోంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతన్నాయి. (Indian stock market).
గత శుక్రవారం ముగింపు (81, 207)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 70 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన బ్యాకింగ్ సెక్టార్‌కు పాజిటివ్‌గా మారింది. ప్రస్తుతం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 81, 368 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 48 పాయింట్ల లాభంతో 24, 943 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో బీఎస్‌ఈ లిమిటెడ్, డెలివరీ, మ్యాక్స్ హెల్త్‌కేర్, బజాజ్ ఫైనాన్స్, ఫోర్టిస్ హెల్త్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). సమ్మన్ క్యాపిటల్, వోడాఫోన్ ఐడియా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, అవెన్యూ సూపర్ మార్కెట్, జిందాల్ స్టీల్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 92 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 308 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.75గా ఉంది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి