Stock Market: సూచీలకు భారీ లాభాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:15 PM
వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు దూకుడుగా ముందుకెళ్లాయి. విదేశీ మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడం పాజిటివ్‌గా మారింది. త్వరలో వెల్లడి కానున్న త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం కూడా ఈ రోజు మార్కెట్లకు కలిసొచ్చింది.
వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు దూకుడుగా ముందుకెళ్లాయి. విదేశీ మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడం పాజిటివ్‌గా మారింది. త్వరలో వెల్లడి కానున్న త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం కూడా ఈ రోజు మార్కెట్లకు కలిసొచ్చింది. ఫైనాన్సియల్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలు భారీ లాభాలను ఆర్జించాయి దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి (Indian stock market).
బుధవారం ముగింపు (82, 605)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత లాభాలు మరింత పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పెరిగి 83, 615 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 862 పాయింట్ల లాభంతో 83, 467 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 261 పాయింట్ల లాభంతో 25, 585 వద్ద స్థిరపడింది (stock market news today). మళ్లీ 25, 500 మార్క్‌కు పైన రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో ఒబెరాయ్ రియాలిటీ, సయింట్, నెస్ట్లే, సోనా బీఎల్‌డబ్ల్యూ, వరుణ్ బేవరేజెస్ మొదలైన షేర్లు లాభాలతో ముగిశాయి (share market news). కేఈఐ ఇండస్ట్రీస్, మ్యాక్స్ ఫైనాన్సియల్స్, డెలివరీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎమ్‌సీఎక్స్ ఇండియా మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 271 పాయింట్లు ఆర్జించింది. బ్యాంక్ నిఫ్టీ 622 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.82గా ఉంది.
ఇవీ చదవండి:
Hyundai Motor India: వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Record-Breaking IPO Market in Samvat 2081: సంవత్ 2081లో ఐపీఓల జోరు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి