Share News

Record-Breaking IPO Market in Samvat 2081: సంవత్‌ 2081లో ఐపీఓల జోరు

ABN , Publish Date - Oct 16 , 2025 | 05:10 AM

rupees1.75 Lakh Crores Raised LG Electronics IPO Shatters Records

Record-Breaking IPO Market in Samvat 2081: సంవత్‌ 2081లో ఐపీఓల జోరు

  • రూ.1.75 లక్షల కోట్ల సమీకరణ.. రికార్డు సృష్టించిన ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌

న్యూఢిల్లీ: ఈ దీపావళితో ముగిసే ‘సంవత్‌ 2081’ (నవంబరు, 2024-అక్టోబరు, 2025) ఐపీ ఓ మార్కెట్‌కు బాగానే కలిసొచ్చింది. ఈ కాలం లో 103 ప్రధాన కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌ ద్యారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమీకరించా యి. సంవత్‌, 2080తో పోలిస్తే ఐపీఓకు వచ్చిన కంపెనీల సంఖ్య 229 తగ్గినా సమీకరించిన నిధులు మాత్రం రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ.1.75 లక్షల కోట్లకు పెరగడం విశేషం. ఇందు లో 12 కంపెనీల ఐపీఓలు మదుపరులకు భారీ లాభాలు పంచి ఇచ్చాయి. ఈ సంవత్‌లో బీఎ్‌స ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫాం ద్వారా 343 ఎస్‌ఎంఈలు రూ.10,399.71 కోట్లు సమీకరించాయి.

ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ రికార్డు: ఇటీవల మార్కెట్‌కు వచ్చిన ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఐపీఓ మదుపరులకు మంచి లాభాలు పంచింది. ఐపీఓ కూడా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. ఐపీఓ ద్వారా రూ.11,607 కోట్లు సమీకరించాలని భావించగా, మదుపరుల నుంచి రూ.4.5 లక్షల కోట్లకు బిడ్స్‌ వచ్చి భారత ఐపీఓ చరిత్రలో కొత్త రికార్డు నమోదు చేసింది.

మెరుపులు: సంవత్‌, 2081లో జనవరిలో రూ.90 అప్పర్‌ ప్రైస్‌బ్యాండ్‌తో జారీ చేసిన స్టాలియన్‌ ఇండియా ఫ్లోరోకెమికల్స్‌ కంపె నీ షేర్లు ప్రస్తుతం బీఎ్‌సఈలో రూ.395.75 వద్ద ట్రేడవుతున్నాయి. బుధవారం సైతం ఈ కంపెనీ షేర్లు 9.99 శాతం లాభాలతో ముగిశాయి. దీనికి తోడు జింకా లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌, క్వాలిటీ పవర్‌ ఎలక్ట్రికల్‌ ఎక్వి్‌పమెంట్‌, ఆదిత్య ఇన్ఫోటెక్‌, ఏథర్‌ ఎనర్జీ కంపెనీల ఐపీఓలూ మదుపరులకు 34ు శాతం నుంచి 275ు వరకు లాభాలు పంచాయి.


డీఐఐల అండ: ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎఫ్‌పీఐలు మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.2.03 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇదే సమయంలో బ్యాంకులు, దేశీయ ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి దేశీయ సం స్థాగత మదుపరులు రూ.6 లక్షల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత ఏడాది మొత్తం తో పోలిస్తే ఇది రూ.74,000 కోట్లు ఎక్కువ. డీఐఐలు గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో షేర్లను కొనుగోలు చేయలేదు.

ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 05:10 AM