Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు..
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:08 AM
రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500 శాతం పన్నులు విధిస్తామని అమెరికా హెచ్చరించడం కూడా మదుపర్లలో ఆందోళన నింపుతోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం నష్టాల్లో కదలాడుతున్నాయి.
గత ఆరు సెషన్లుగా లాభాలను ఆర్జిస్తూ వస్తున్న దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీలను కిందకు లాగుతున్నాయి. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500 శాతం పన్నులు విధిస్తామని అమెరికా హెచ్చరించడం కూడా మదుపర్లలో ఆందోళన నింపుతోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 950)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కిందకు దిగజారింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 320 పాయింట్ల నష్టంతో 84, 630 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 108 పాయింట్ల లాభంతో 25, 904 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో ఫెడరల్ బ్యాంక్, హడ్కో, హీరో మోటోకార్ప్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కేన్స్ టెక్నాలజీస్, హిందుస్థాన్ జింక్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, డాబర్ రెడ్, వేదాంత మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 284 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.62గా ఉంది.
ఇవీ చదవండి:
ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..
దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!