Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. 350 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
ABN , Publish Date - Nov 14 , 2025 | 10:44 AM
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు సూచీలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత రెండ్రోజులుగా సూచీలు భారీ లాభాలను ఆర్జించిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.
ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్ల కోతను ప్రకటించడం లేదనే వార్తలు మదుపర్లలో ఆందోళనకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత రెండ్రోజులుగా సూచీలు భారీ లాభాలను ఆర్జించిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 478)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 450 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 359 పాయింట్ల నష్టంతో 84, 118 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 111 పాయింట్ల నష్టంతో 25, 767 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో ముత్తూట్ ఫైనాన్స్, జుబిలెంబ్ ఫుడ్, భారత్ డైనమిక్స్, వోడాఫోన్ ఐడియా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇన్ఫోసిస్, ప్రెస్టేజ్ ఎస్టేట్, ఎస్‌ఆర్‌ఎఫ్, ఎంఫసిస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 143 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.73గా ఉంది.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి