Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Nov 10 , 2025 | 10:22 AM
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు పాజిటివ్‌గా మారాయి.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు పాజిటివ్‌గా మారాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (83, 216)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 348 పాయింట్ల లాభంతో 83, 565 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 104 పాయింట్ల లాభంతో 25, 596 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో నేషనల్ అల్యూమినియం, నైకా, టోరెంట్ ఫార్మా, భారత్ డైనమిక్స్, యూనో మిండా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ట్రెంట్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌సీసీ, ఎల్ఐసీ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 198 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 132 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.69గా ఉంది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి