Stock Market: ఆర్బీఐ రెపోరేట్ జోష్.. లాభాల్లోకి సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:07 AM
గత ఎనిమిది సెషన్లుగా వరుసగా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలకు ఆర్బీఐ రెపోరేట్ జోష్ అందించింది. ఆర్బీఐ రెపోరేట్‌ను మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్‌లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
గత ఎనిమిది సెషన్లుగా వరుసగా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలకు ఆర్బీఐ రెపోరేట్ జోష్ అందించింది. ఆర్బీఐ రెపోరేట్‌ను మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్‌లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతన్నాయి. (Indian stock market).
మంగళవారం ముగింపు (80, 267)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత కనిష్టం నుంచి ఏకంగా 400 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10:50 గంటల సమయంలో సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 80, 560 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 76 పాయింట్ల లాభంతో 24, 687 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో హడ్కో, లూపిన్, టాటా మోటార్స్, వోడాఫోన్ ఐడియా, ఆర్‌ఈసీ, ట్రెంట్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఆర్బీఎల్ బ్యాంక్, డెలివరీ, ఎస్బీఐ కార్డ్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 27 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 374 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.72గా ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి