Stock Market: వరుస నష్టాల నుంచి లాభాల్లోకి.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:09 PM
వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభాలను ఆర్జించాయి. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఆ ప్రభావంతో గత సెషన్లలో దేశీయ సూచీలు నష్టాలతోనే ముగిశాయి.
వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభాలను ఆర్జించాయి. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఆ ప్రభావంతో గత సెషన్లలో దేశీయ సూచీలు నష్టాలతోనే ముగిశాయి. అయితే కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడం, త్వరలో వెల్లడి కానున్న త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం ఈ రోజు మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను ఆర్జించాయి (Indian stock market).
మంగళవారం ముగింపు (82, 029)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత లాభాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 575 పాయింట్ల లాభంతో 82, 605 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 178 పాయింట్ల లాభంతో 25, 323 వద్ద స్థిరపడింది (stock market news today). మళ్లీ 25, 300 మార్క్‌కు పైన రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్, పెర్సిస్టెంట్, వొడాఫోన్ ఐడియా, ప్రెస్టీజ్ ఎస్టేట్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాలతో ముగిశాయి (share market news). సయింట్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, డెలివరీ, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 646 పాయింట్లు ఆర్జించింది. బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.08గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News