Share News

India Evs: 2032 నాటికి భారత్ వీధుల్లో 123 మిలియన్లకు పైగా ఈవీలు

ABN , Publish Date - May 12 , 2025 | 09:51 PM

దేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే 2032 నాటికి దేశంలోని రోడ్లపై 123 మిలియన్ల విద్యుత్ వాహనాలు ప్రయాణిస్తాయని ఓ రిపోర్ట్ తెలిపింది. ఇంకా ఈ నివేదిక కీలక అంశాలను ప్రస్తావించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

India Evs: 2032 నాటికి భారత్ వీధుల్లో 123 మిలియన్లకు పైగా ఈవీలు
India ev vehicle growth 2032

భారతదేశంలో ఈవీల వినియోగంపై ఇండియా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఓవర్‌వ్యూ నివేదిక కీలక విషయాలను ప్రకటించింది. ఈ క్రమంలో 2032 నాటికి దేశంలోని రోడ్లపై 123 మిలియన్లకు పైగా విద్యుత్ వాహనాలు పరుగులు తీయనున్నట్లు తెలిపింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (IESA), కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (CES) ఈ నివేదికను సంయుక్తంగా రూపొందించాయి. కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది.

భారతదేశం ఈవీ లక్ష్యాలు

భారత ప్రభుత్వం EV30@30 కార్యక్రమం ద్వారా 2030 నాటికి కొత్త కార్ల విక్రయాలలో 30% విద్యుత్ వాహనాల వాటాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం వివిధ రకాల చర్యలను చేపడుతోంది. ముఖ్యంగా చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి, రీ సైక్లింగ్ వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది.


ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్థితి

ఈ క్రమంలో 2024 నాటికి భారతదేశంలో 76,000 పబ్లిక్, క్యాప్టివ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటి మొత్తం ఇన్‌స్టాల్ సామర్థ్యం 1.3 GW. అయితే, ఈ సంఖ్య 2032 నాటికి 0.9 నుంచి 2.1 మిలియన్ల వరకు పెరగాల్సి ఉంది. ఇన్‌స్టాల్ సామర్థ్యం 23 GWకి చేరుకోవాల్సి ఉంది.

రాష్ట్రాల వారీగా చూస్తే..

2024లో ఉత్తర్ ప్రదేశ్ EV విక్రయాలలో 19% వాటాతో ముందంజలో ఉంది. తరువాత మహారాష్ట్ర (12%), కర్ణాటక (9%) రాష్ట్రాలు ఉన్నాయి. చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా, కర్ణాటక రాష్ట్రం 5,765 చార్జింగ్ స్టేషన్లతో మొదటి స్థానంలో ఉంది. తరువాత మహారాష్ట్ర (3,728), ఉత్తర్ ప్రదేశ్ (1,989) రాష్ట్రాలు ఉన్నాయి.


ప్రభుత్వం చర్యలు

ప్రభుత్వం PM E-DRIVE పథకం ద్వారా ఈవీ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రూ.2,000 కోట్లను కేటాయించింది. ఈ పథకం ద్వారా 22,100 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పెట్టుబడుల అవసరం

IESA ప్రకారం, భారతదేశం EV చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణకు $20-30 బిలియన్ పెట్టుబడులు అవసరం. ఈ పెట్టుబడులు చార్జింగ్ వేగాన్ని పెంచడంలో, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. EVల స్వీకరణకు ప్రధాన సవాళ్లలో చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపం, బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి, ధరల వ్యత్యాసం ఉన్నాయి. అయితే, ఈ సవాళ్లను అధిగమించడం ద్వారా భారతదేశం సుస్థిర రవాణా వ్యవస్థను నెలకొల్పే ఛాన్స్ ఉంది.


ఇవి కూడా చదవండి

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..


Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 12 , 2025 | 09:57 PM