RBI Governor Sanjay Malhotra: త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:04 AM
ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం...
జన్ ధన్ పథకంతో ఆర్థికానికి ఊతం
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ఇండోర్ (మధ్య ప్రదేశ్): ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ప్రపంచంలోని ఐదు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం ఒకటి. త్వరలోనే మనం మూడో స్థానానికి చేరుకోబోతున్నాం’ అని మల్హోత్రా అన్నారు. ట్రంప్ సుంకాల పోటు నేపథ్యంలోనూ జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు ఐదు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 7.8 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, బ్యాంకులు కలిసి 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ ధన్ పథకం కూడా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తోందని మల్హోత్రా తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 55 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభమైనట్టు వెల్లడించారు. దాంతో ఈ ఖాతాదారులందరికీ పొదుపు, పెన్షన్, బీమా, రుణాలతో పాటు ఇతర ఆర్థిక సేవలూ అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేయకుండా జన్ ధన్ ఖాతాదారులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి