Rare Earth Magnets: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తికి రూ.7,300 కోట్ల ప్రోత్సాహం
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:46 PM
అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తికి భారత సర్కారు చేయూత నివ్వబోతోంది. అందుకోసం రూ. 7,300 కోట్ల ప్రోత్సాహక పథకం తీసుకొస్తోంది. ఇప్పటి వరకూ భారత్ ఈ మ్యాగ్నెట్‌ల కోసం చైనా, జపాన్..
ఇంటర్నెట్ డెస్క్: అరుదైన భూ అయస్కాంతాల (Rare Earth Magnets) ఉత్పత్తికి భారత సర్కారు చేయూత నివ్వబోతోంది. ఈ రంగం భారత దేశంలో ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని రంగంగానే ఉండటంతో ఈ మేరకు మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దేశీయ స్థాయిలో ఈ రంగంలో ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీలు, కొన్ని ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.
అయితే, ప్రస్తుతం భారత్ ఎక్కువగా రేర్ ఎర్త్ మెటీరియల్స్, మ్యాగ్నెట్‌ల కోసం చైనా, జపాన్ వంటి దేశాలపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తాజాగా ప్రకటించిన రూ. 7,300 కోట్ల ప్రోత్సాహక పథకం ప్రకటనతో ఈ రంగంలోని భారతీయ కంపెనీలు మరింతగా ముందుకెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఈ రంగంలో కీలకంగా ఉన్న కంపెనీల విషయానికి వస్తే, ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) ఉంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ (PSU) కాగా, భారత అణుశక్తి శాఖ క్రింద పనిచేస్తుంది. IREL రేర్ ఎర్త్ మెటీరియల్స్ (నీఓడిమియం, ప్రాసియోడిమియం మొదలైనవి) ఉత్పత్తి చేస్తుంది.
ఈ రంగంలోని మరో కంపెనీ ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ లిమిటెడ్ (ఈఎస్‌ఎల్). ఈ కంపెనీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇప్పటికీ పరిశోధన, అభివృద్ధి (R&D) దశలో ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా మరింత పెట్టుబడులు దక్కించుకునే అవకాశం ఉంది.
ప్రైవేటు స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు కొన్ని చిన్న-మధ్య తరహా సంస్థలు (MSMEs)స్టార్టప్‌లు, బెంగళూరు, పూణేల్లో, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ల కోసం ప్రాథమిక పరిశోధనలు చేస్తున్నాయి. అయినా, వీటి ఉత్పత్తి స్థాయి పరిమితం. వీటికి ప్రభుత్వ మద్దతు అవసరం ఉంది.
ప్రస్తుతం భారత్‌లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రూ. 7,300 కోట్ల ప్రోత్సాహక పథకం ప్రకటనతో భారతీయ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. IRELతో పాటు, భవిష్యత్తులో టాటా, రిలయన్స్, మహీంద్రా వంటి పెద్ద సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..
ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..