ఐసీఐసీఐ ప్రు క్వాలిటీ ఫండ్
ABN , Publish Date - May 12 , 2025 | 05:18 AM
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్.. క్వాలిటీ ఫండ్‌ను ప్రారంభించింది. క్వాలిటీ ఫ్యాక్టర్ థీమ్‌తో రూపొందించిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ఇది....
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్.. క్వాలిటీ ఫండ్‌ను ప్రారంభించింది. క్వాలిటీ ఫ్యాక్టర్ థీమ్‌తో రూపొందించిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ఇది. గరిష్ఠ రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌ఓఈ), నగదు లభ్యత, బలమైన ఆర్థిక పునాదులు కలిగిన సంస్థల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చిత వాతావరణంలో మదుపరులు మంచి లాభాలు అందించాలన్న లక్ష్యంతో ఈ ఫండ్‌ను రూపొందించినట్లు ఐసీఐసీఐ ప్రు వెల్లడించింది. ఈ ఫండ్‌కు నిఫ్టీ 200 క్వాలిటీ 30 టీఆర్‌ఐ, వాల్యూ 30 టీఆర్‌ఐ, మూ మెంటమ్ 30 టీఆర్‌ఐ, ఆల్ఫా 30 టీఆర్‌ఐ, 200 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌గా ఉండనున్నాయి. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 20.
స్థిర వడ్డీతో గృహేతర రుణాలు...
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ స్థిర వడ్డీ రేట్లతో కొత్త గృహేతర రుణాలను అందుబాటులోకి తెచ్చింది. ఆస్తి, వాణిజ్య స్థలం, ఖాళీ స్థలంపై రుణాలు, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్‌కు ఈ పథకం వర్తిస్తుంది. వడ్డీ రేటు 10% నుండి మొదలవుతాయి. స్థిర వడ్డీతో 15 ఏళ్ల వరకు ఈఎంఐ సౌకర్యం ఉంటుంది. వేగవంతమైన ప్రాసెసింగ్, ఇంటి వద్దకే సేవలు కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎండీ, సీఈఓ గిరీష్ కౌస్గి మాట్లాడుతూ.. స్థిరమైన రుణ ఎంపికలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ రిటైల్ రుణాలలో గృహేతర రుణాలు 28.5% ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Read Latest International News And Telugu News