Personal Finance: 10 ఏళ్లలో కోటీశ్వరులు కావడం ఎలా.. నెలకు ఎంత కట్టాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:22 PM
అనేక మంది కూడా ఎలాగైనా కోటీశ్వరులు కావాలని భావిస్తుంటారు. కానీ తక్కువ మంది మాత్రమే ఆచరణలో పాటిస్తారు. మీరు తలుకుంటే రోజుకో వెయ్యి సేవ్ చేస్తే చాలు, ఈజీగా కోటీశ్వరులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న చిన్న ఉద్యోగాలు చేసే అనేక మంది కూడా కోటీశ్వరులు కావాలని భావిస్తుంటారు. కానీ వారు కష్టపడి శ్రమిస్తూ, వచ్చే జీతాన్ని ఇంటి కిరాయి సహా పలు రకాల ఈఎంఐల కోసం కట్టేస్తూ మిగిలిన మొత్తంతో సాధారణం జీవనం గడిపేస్తారు. ప్రతి నెలలో కూడా మిగిలిన మొత్తాన్ని సేవ్ చేయాలని భావిస్తుంటారు. కానీ అది కుదరకపోగా వచ్చే ఆకస్మిక ఖర్చుల కారణంగా మరికొంత మంది అప్పులు చేస్తుంటారు. అయితే ఈ కష్టాలు వారిని కోటీశ్వరులుగా మార్చేందుకు ఇబ్బందులను సృష్టిస్తుంటాయి.
ప్రభుత్వ స్కీంల ద్వారా
కానీ ప్రతి నెలలో కూడా జీతం వచ్చిన తర్వాత లేదా ప్రతి రోజు కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా సేవ్ చేస్తే ఈజీగా కోటీశ్వరులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా సాధ్యం, నెలకు ఎంత కట్టాలి, ఎన్నేళ్లు కట్టాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే తక్కువ కాలంలో అంటే 10 ఏళ్లలో కోటీశ్వరులు కావాలంటే సాధారణ ప్రభుత్వ స్కీంల ద్వారా సాధ్యం కాదని చెప్పవచ్చు. దీనికి ఉన్న మార్గాలలో సిప్ లేదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ ఉన్నాయి. వీటిలో సిప్ విధానంలో రిస్క్ తక్కువ, కాబట్టి దీనిలో క్రమం తప్పకుండా సేవింగ్ చేస్తే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఇలా చేస్తే కోటి రూపాయలు
ఈ క్రమంలో మీరు రోజుకు వెయ్యి రూపాయలు సేవ్ చేసి, సిప్ విధానంలో పెట్టుబడులు చేస్తే 10 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు. ఈ నేపథ్యంలో రోజుకు 1100 అంటే, నెలకు రూ. 33 వేలు ఇన్వెస్ట్ చేయాలి. ఇలా మీరు క్రమం తప్పకుండా 10 సంవత్సరాలలో రూ. 39,60,000 లక్షలు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. కానీ మీకు ఆ తర్వాత రూ. 1,01,99,642 లభిస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలోనే రూ. 62,39,642 లక్షలు లభిస్తాయి.
రాబడి రేటు
ఇక్కడ మీరు పెట్టబడి చేసిన మొత్తంపై సంవత్సరానికి సగటున 18 శాతం రాబడిని పొందినట్లయితే, మీరు పదేళ్లలో కోటి రూపాయలు దక్కించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో సంవత్సరానికి సగటున 12-21% రాబడిని ఇచ్చే అనేక మ్యూచువల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, రాబడి రేటు అనేది హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అందువల్ల మెచ్యూరిటీ మొత్తం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ గణన మాత్రమే, పెట్టుబడి సలహా కాదు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ పరిస్థితులకు లోబడి ఉంటాయి. మీకు పెట్టుబడి చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇవి కూడా చదవండి:
Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News