ISRO HAL Collaboration: ఎస్‌ఎస్‌ఎల్‌వీ తయారీ కోసం 3 కంపెనీలతో హెచ్‌ఏఎల్ ఒప్పందం
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:15 AM
500 కిలోల కన్నా తక్కువ బరువు గల ఉపగ్రహాల ప్రయోగానికి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్‌ఎ్‌సఎల్‌వీ) తయారీ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్),...
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): 500 కిలోల కన్నా తక్కువ బరువు గల ఉపగ్రహాల ప్రయోగానికి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్‌ఎ్‌సఎల్‌వీ) తయారీ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆఽథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పే్‌స), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సఐఎల్) మధ్య సాంకేతిత బదిలీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా హెచ్‌ఏఎల్ ఎస్‌ఎ్‌సఎల్‌వీ రాకెట్లను సొంతంగా అభివృద్ధి చేయడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా స్వీకరిస్తుంది. ఇందుకోసం వచ్చే రెండేళ్లపాటు హెచ్‌ఏఎల్‌కు ఇస్రో అవసరమైన శిక్షణ ఇవ్వడంతోపాటు రాకెట్ల అభివృద్ధికి సాంకేతిక మద్దతునివ్వనుంది.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News