GST cut car prices: భారీగా తగ్గనున్న కార్ల ధరలు.. కొన్నింటి ధరల్లో రూ.30.4 లక్షల మేర కోత
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:54 PM
జీఎస్టీ రేట్ల కోతను ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకు కార్ల తయారీదార్లు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కొన్ని కార్ల ధరలు గరిష్ఠంగా రూ.30.4 లక్షల వరకూ తగ్గే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలతో దేశంలో వినియోగం పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. కొత్త జీఎస్టీ విధానంలో పలు వస్తువులపై పన్నులను భారీగా తగ్గించారు. ఇందులో ఆటొమొబైల్ రంగం కూడా ఉంది. ఇక కొత్త పన్ను శ్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇటు పండుగ సీజన్, అటు జీఎస్టీ పన్నుల్లో కోతను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైన కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో వివిధ సంస్థల కార్ల ధరల్లో తగ్గుదలపై నిపుణులు ఓ అంచనాకు వచ్చారు (GST cut car prices India).
నిపుణులు చెప్పేదాని ప్రకారం, టాటామోటర్స్ కార్ల ధరలు ఆయా మెడల్స్‌ను బట్టి రూ.75 వేల నుంచి రూ.1.45 లక్షల మేర తగ్గే ఛాన్సుంది. ఇక మహీంద్రా కార్ల ధరలు కూడా గరిష్ఠంగా రూ.1.56 లక్షల మేర తగ్గొచ్చు. టొయోటా కార్ల ధరలు మోడల్‌ను బట్టి రూ.3.49 లక్షల వరకూ తగ్గే ఛాన్సుంది. రెనాల్ట్ కార్ల ధరలు గరిష్ఠంగా రూ.96,395 మేర, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు రూ.4.5 లక్షల నుంచి రూ.30.4 లక్షల వరకూ తగ్గనున్నాయి. ఇక వోల్వో కార్ల ధరలు రూ.6.9 లక్షల వరకూ తగ్గొచ్చు (GST car discount India).
1500 సీసీకి పైబడిన ఇంజెన్ ఉన్న ప్యాసింజర్ ఎస్‌యూవీలపై పన్నును 40 శాతానికి కేంద్రం పరిమితం చేసింది. గతంలో వీటిపై 28 శాతం జీఎస్టీతో పాటు 22 సెస్ విధించేవారు. దీంతో, ఈ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 1200 సీసీ ఇంజెన్ సామర్థ్యంతో 4 మీటర్ల లోపు పొడవుండే చిన్న కార్లపై ప్రస్తుతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 1500 సీసీ లోపు ఇంజెన్ సామర్థ్యమున్న డీజిల్ కార్లనూ చిన్నవిగా పరిగణిస్తూ తక్కువ జీఎస్టీ విధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News