Gold Prices Rise: తగ్గిన ధరలకు బ్రేక్..మళ్లీ పుంజుకున్న బంగారం, తగ్గిన వెండి ధరలు
ABN , Publish Date - May 05 , 2025 | 12:40 PM
బంగారం, వెండి ధరలు 60 నుంచి 70 వేలకు వస్తాయని ఆశించిన వారికి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత వారం భారీగా తగ్గిన రేట్లు, ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశవ్యాప్తంగా గత వారం భారీగా పడిపోయిన ధరలకు బ్రేక్ పడింది. ఈ వారం మళ్లీ పెరుగుదల ట్రెండ్ వచ్చేసింది. ఈ క్రమంలోనే నేడు (మే 5, 2025) బంగారం ధరలు మళ్లీ పెరిగాయి (Gold Prices Rise). సోమవారం మార్కెట్ మొదలైన నేపథ్యంలో బంగారం ధరలు ఊపందుకున్నాయి. అదే సమయంలో వెండి ధరలు భారీగా తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో మే 5, 2025న 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 87,750కి చేరుకుంది. ఇది మునుపటి రోజుతో పోలిస్తే రూ. 20 ఎక్కువ. ఇక 100 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 8,77,500గా ఉంది. ఇక 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 22 పెరిగింది. ఈ క్రమంలో 100 గ్రాముల ధర రూ. 9,57,300కు చేరుకుంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు పెరుగుతుంటే, వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. ఈ క్రమంలో మే 5న కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ.97,000కు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ.108,000కు చేరుకోగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ.97,000గా ఉంది. మరోవైపు చెన్నై,కేరళ, భువనేశ్వర్‌లో మాత్రం రూ.108,000గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఈ క్రమంలో చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 87,750గా ఉంది. ఢిల్లీలో మాత్రం ధర కాస్త ఎక్కువగా రూ. 87,900గా కలదు. అదే విధంగా, 24 క్యారెట్ బంగారం ధర ఈ నగరాల్లో 10 గ్రాములకు రూ. 95,730గా ఉంది. ఇదే సమయంలో పాట్నా, సూరత్‌లో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.95,780గా ఉండగా, 22 క్యారెట్ పసిడి ధర రూ.87,800గా ఉంది.
గత రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
మే 4, 2025 ఆదివారం రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ ధర గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 87,550 కాగా, 24 క్యారెట్ పసిడి ధర 10 గ్రాములకు రూ. 95,510గా ఉంది. మే 2న మాత్రం 22 క్యారెట్ రూ. 20, 24 క్యారెట్ రూ. 22 తగ్గాయి. మే 1 రోజు మాత్రం అతిపెద్ద పతనం కనిపించింది. 22 క్యారెట్ రూ. 200, 24 క్యారెట్ రూ. 218 తగ్గాయి. ఏప్రిల్ 30 నాడు కూడా 22 క్యారెట్ రూ. 5, 24 క్యారెట్ రూ. 6 తగ్గాయి.
ఇవి కూడా చదవండి:
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Tom Bailey: మ్యాచ్ ఆడుతున్న క్రమంలో జేబులోంచి పడిన మొబైల్.. వీడియో వైరల్
Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..
Read More Business News and Latest Telugu News