బంగారం భగ్గు
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:03 AM
పసిడి పరుగు ఆపట్లేదు. రోజుకో రికార్డు స్థాయికి ఎగబాకుతోంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజే రూ.2,430 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.88,500కు చేరింది...
ఒక్కరోజే రూ.2,430 పెరుగుదల
10 గ్రాములు రూ.88,500
రూ.97,500కు కిలో వెండి ధర
న్యూఢిల్లీ: పసిడి పరుగు ఆపట్లేదు. రోజుకో రికార్డు స్థాయికి ఎగబాకుతోంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజే రూ.2,430 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.88,500కు చేరింది. కిలో వెండి సైతం రూ.1,000 పెరుగుదలతో రూ.97,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ విలువైన లోహాలకు భారీ డిమాండ్ నెలకొనడంతో పాటు రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశీయంగా వీటి రేట్లు భగ్గుమంటున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 2,900 డాలర్ల మైలురాయిని సైతం దాటేసింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ రేటు ఒక దశలో 45.09 డాలర్లు (1.56 శాతం) పెరిగి ఆల్‌టైం రికార్డు స్థాయి 2,932.69 డాలర్లకు ఎగబాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రేటు సైతం దాదాపు ఒక శాతం పెరుగుదలతో 32.76 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలు ఇందుకు కారణమయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (గడిచిన 41 రోజుల్లో) బంగారం ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. ట్రంప్ టారి్‌ఫలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీయవచ్చన్న భయాందోళనలు ఉధృతమవుతున్నాయి. తత్ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగించడంతో పాటు కమోడిటీల ధరలు మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో పెట్టుబడులకు భద్రమైన సాధనంగా పేరుండటంతో బంగారానికి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. దాంతో అంతర్జాతీయంగా, దేశీయంగా వీటి ధరలు కొండెక్కుతున్నాయని బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్లో వాణిజ్య అనిశ్చితి మరింత పెరిగితే, త్వరలోనే ఔన్స్ గోల్డ్ 3,000 డాలర్లకు చేరుకోవచ్చని వారు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
Stock Market: 1138 పాయింట్లు పడిపోయిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల ఆందోళన..
Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News