Gold and Silver Rates Today: భారీగా పెరిగిన వెండి, బంగారం.. సరికొత్త రికార్డుల వైపు..
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:17 PM
బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 24, 260కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 13, 900కి చేరింది.
బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 24, 260కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 13, 900కి చేరింది. (live gold rates). ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 24, 410కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 14, 050కి చేరుకుంది.
మరోవైపు వెండి కూడా పరుగులు తీస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కిలో వెండి ఏకంగా 3000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 1, 87, 000కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ. 1, 77, 000గా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కిలో వెండి ధర రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం సిల్వర్ స్పీడ్ చూస్తుంటే అంత సమయం పట్టేలా కనిపించడం లేదు.
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఏనుగు vs ఖడ్గమృగం.. ఈ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
మీకు కశ్మీర్ ఇస్తే ఏం చేసుకుంటారు.. పాకిస్థాన్ టోల్ ప్లాజాపై నెటిజన్ల సెటైర్లు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..