Gold and Silver Rates Today: వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు, ఇక వెండి..
ABN , Publish Date - Jun 29 , 2025 | 06:49 AM
దేశంలో వారం క్రితం లక్ష స్థాయికి చేరుకున్న పసిడి ధరలు ప్రస్తుతం క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మూడోరోజు వరుసగా గోల్డ్ రేట్లు (Gold and Silver Rates Today) తగ్గిపోవడం విశేషం. అయితే ఏ మేరకు తగ్గాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశంలో పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు ఒక సంప్రదాయంగా మారింది. వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ క్రమంలోనే నేడు (జూన్ 29, 2025) గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6.40 గంటలకు హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు (Gold and Silver Rates Today) కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.590 తగ్గి రూ.97,420కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.89,300 వద్ద స్థిరపడింది. ఈ మార్పులు బంగారం కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు కొంత ఊరటనిస్తాయని చెప్పవచ్చు.
ఇతర ప్రాంతాల్లో..
ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,570కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 89,450కి చేరింది. మరోవైపు చెన్నై, ముంబయి, బెంగళూరు, కేరళ, కటక్ ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.97,420 స్థాయిలో ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.89,300గా ఉంది.
నేటి వెండి ధరలు
ఇక నేటి వెండి ధరల విషయానికి వస్తే మాత్రం నిన్నటితో పోల్చుకుంటే మార్పు లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో రూ. 1,17,800గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, వడోదర, పాట్నా, సూరత్, మైసూర్, నాగ్‌పూర్ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు రూ. 1,07,800 స్థాయిలో ఉంది.
బంగారంలో ఏది బెస్ట్?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. ఇది పెట్టుబడులు, బంగారం నాణేలు, బిస్కెట్ల కోసం మంచి ఎంపికగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో కొంత ఇతర లోహాలను కలుపుతారు. ఒకవేళ మీరు ఆభరణాల కోసం బంగారం కొనాలనుకుంటే, 22 క్యారెట్ల బంగారం ఎంచుకోవడం మంచిది. ఇది రోజువారీ ఉపయోగానికి అనుకూలంగా ఉంటుంది.
బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. బంగారం స్వచ్ఛతను ధృవీకరించే హాల్‌మార్క్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. రేట్లు వివిధ జ్యువెలరీ షాపుల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. 22 క్యారెట్ల ఆభరణాల కొనుగోలు సమయంలో మేకింగ్ ఛార్జీలను పరిశీలించాలి. ఎందుకంటే ఇవి ఒక షాపు నుంచి మరో షాపుకు మారుతాయి.
ఇవీ చదవండి:
కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి