Share News

Gold and Silver Record high: రికార్డ్ స్థాయికి వెండి, బంగారం.. టార్గెట్ ఎంత..

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:41 PM

బంగారం, వెండి ధరలు రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం ఈ అరుదైన లోహాలకు కలిసి వస్తోంది.

Gold and Silver Record high: రికార్డ్ స్థాయికి వెండి, బంగారం.. టార్గెట్ ఎంత..
gold and silver rates today

బంగారం, వెండి ధరలు రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం ఈ అరుదైన లోహాలకు కలిసి వస్తోంది. సెంట్రల్ బ్యాంకు కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంతో 2025లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి (Gold Silver Rate).


దీపావళికి ముందు, గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ. 1, 29, 440 వద్ద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ. 1, 89, 000 కు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు, బంగారం ధర 66% కంటే ఎక్కువ రాబడిని అందించింది. అలాగే వెండి ధర దాదాపు 87% పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ రెండు లోహాలు మరింతగా పైకి ఎగబాకుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అస్థిరత, అడపాదడపా దిద్దుబాట్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, విశ్లేషకులు బుల్లిష్ దృక్పథాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు (Gold Rate Today).

silver.jpg


సురక్షిత పెట్టుబడులు, వడ్డీ రేట్లు తగ్గడం, రూపాయి విలువ తగ్గడం, సెంట్రల్ బ్యాంక్ దూకుడుగా పెట్టుబడులు పెట్టడం వంటి కారణాల వల్ల బంగారంలో పెరుగుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షల దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరంలో బంగారం ధరలు రూ. 1,10,000 - రూ. 1,45,000 మధ్య ఉంటాయని నిపుణుల అంచనా (Gold and silver prices target).


మరోవైపు వెండి కూడా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది (Silver Rate Today). వెండిని కూడా సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. మరోవైపు పారిశ్రామిక వినియోగం కూడా వెండి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. వెండి సరఫరా లోటు వరుసగా ఏడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం.. వెండి ధర 2026 చివరి నాటికి కిలోకు రూ. 2,40,000కు చేరుకుంటుంది.


ఇవీ చదవండి:

Hyundai Motor India: వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు

Record-Breaking IPO Market in Samvat 2081: సంవత్‌ 2081లో ఐపీఓల జోరు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 05:01 PM