Farming Solutions: గోద్రెజ్ అషిటక కలుపు నాశని
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:00 AM
గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ మరో సరికొత్త ఉత్పత్తిని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ‘అషిటక’ పేరుతో విడుదల చేస్తున్న ఈ మందు మొక్కజొన్న పంటలో కలు పు మొక్కల నివారణకు...
మొక్కజొన్న పంట కోసం ప్రత్యేకం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ మరో సరికొత్త ఉత్పత్తిని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ‘అషిటక’ పేరుతో విడుదల చేస్తున్న ఈ మందు మొక్కజొన్న పంటలో కలు పు మొక్కల నివారణకు బాగా పని చేస్తుందని కంపె నీ పంటల సంరక్షణ వ్యాపార విభాగం సీఈఓ ఎన్‌కే రాజవేలు చెప్పారు. మొక్కజొన్న పంట రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నపుడు ఈ మందు పిచికారీ చేస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందన్నారు. ఈ నెలాఖరు నుంచే తెలుగు రాష్ట్రాల్లోని తమ డీలర్లకు ఈ మందు సరఫరా ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ సహా దేశంలో వెయ్యికి పైగా పంట పొలాల్లో పరీక్షల తర్వాత ఈ కలుపు నాశని మందును విడుదల చేస్తున్నట్టు రాజవేలు చెప్పారు. జపాన్ కేంద్రంగా పనిచేసే ఐఎ్‌సకే అభివృద్ధి చేసిన ఈ మందును గోద్రెజ్ ఆగ్రోవెట్, ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుని రైతులకు సరఫరా చేయనుంది. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే దేశంలోనే ఈ మందును తయారు చేయబోతున్నట్టు చెప్పారు. ఎకరా మొక్కజొన్న చేనుకు సరిపోయేలా ఒకే ప్యాక్‌లో 50 ఎంఎల్ ‘అషిటక’ కీలక ఔషఽఽధాన్ని 400 ఎంఎల్ సర్ఫాక్టెంట్‌తో కలిపి రూ.1,800కు విక్రయించనున్నట్టు రాజవేలు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
For National News And Telugu News