Share News

Gameskraft CFO Ramesh Prabh: గేమ్స్‌క్రాఫ్ట్‌కు సీఎ్‌ఫఓ టోపీ

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:09 AM

కంపెనీలకు ఆయా కంపెనీల ఉన్నతాధికారులే టోపీ పెడుతున్నారు. తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేసే రియల్‌ మనీ గేమ్స్‌ కంపెనీ గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌...

Gameskraft CFO Ramesh Prabh: గేమ్స్‌క్రాఫ్ట్‌కు సీఎ్‌ఫఓ టోపీ

ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ కోసం రూ.250 కోట్లు దారి మళ్లింపు

న్యూఢిల్లీ: కంపెనీలకు ఆయా కంపెనీల ఉన్నతాధికారులే టోపీ పెడుతున్నారు. తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేసే రియల్‌ మనీ గేమ్స్‌ కంపెనీ గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ వీరి బారిన పడింది. సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ) రమేశ్‌ ప్రభు.. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌ కోసం కంపెనీకి చెందిన రూ.250 కోట్లను దారి మళ్లించినట్టు గేమ్స్‌క్రాఫ్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేశ్‌ ప్రభునే స్వయంగా ఈ ఏడాది మార్చి 5న స్వయంగా కంపెనీకి పంపిన ఒక ఈ-మెయిల్‌లో ఈ విషయం ఒప్పుకున్నట్టు కంపెనీ తెలిపింది. గేమ్స్‌క్రాఫ్ట్‌ ఫిర్యాదుతో ఈ నెల 9న పోలీసులు రమేశ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 05:09 AM