Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ లాస్ట్ ఛాన్స్.. వీటిపై క్రేజీ ఆఫర్స్..
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:04 PM
మీరు షాఫింగ్ ఆఫర్ల కోసం చూస్తున్నారా. అయితే, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ తాజాగా ప్రారంభించిన ఫ్రీడమ్ సేల్ ప్రత్యేకంగా పలు రకాల ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు మంచి షాపింగ్ ప్రియులా. అయితే ఇటీవల మొదలైన ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ను వినియోగించుకోండి. ఎందుకంటే ఈ సేల్ ఆగస్టు 8 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్ లాంటి అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పలు రకాల ఉత్పత్తులపై..
మీరు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే iPhone 16, Samsung S24, Nothing Phone 3a లాంటి లేటెస్ట్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. దీంతోపాటు ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలతోపాటు హోమ్ అప్లయన్సెస్ లాంటి ఎలక్ట్రానిక్స్‌పై కూడా సూపర్ డీల్స్ ఉన్నాయి. ఫ్యాషన్ లవర్స్ కోసం కూడా ఈ సేల్‌లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మీ కళ్లను మరింత ఆకర్షణీయంగా మార్చుకునేందుకు పలు రకాల ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్లు, ఇతర డీల్స్
మరోవైపు ట్రెండీ దుస్తులు, ఫుట్‌వేర్, యాక్సెసరీస్‌పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తున్నాయి. ఇంకా, ఇంటి డెకరేషన్ కోసం ఫర్నిచర్, కిచెన్ అప్లయన్సెస్‌పై కూడా డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో ICICI బ్యాంక్, BoB కార్డ్ వాడే వాళ్లకి క్రెడిట్ కార్డ్ లేదా EMI ట్రాన్సాక్షన్స్‌పై 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఎలిజిబుల్ ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్ EMI ఆప్షన్స్ కూడా ఉంది.
షాపింగ్ చేయడం వల్ల
మీ పాత ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ ఐటమ్‌ని ఎక్స్ఛేంజ్ చేస్తే అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి మరో స్పెషల్ బెనిఫిట్ ఉంది. మీరు మీ సూపర్‌కాయిన్స్ వాడుకుని ఎక్స్‌ట్రా సేవింగ్స్ పొందవచ్చు. అంటే, ఈ సేల్‌లో షాపింగ్ చేయడం వల్ల డబ్బు ఆదా చేయడమే కాదు, మీ బడ్జెట్‌లో సూపర్ డీల్స్ కూడా దొరుకుతాయి.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి