Fitch Ratings: భారత్ రేటింగ్ యథాతథం
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:51 AM
భారత సార్వభౌమ పరపతి రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ రేటింగ్ సోమవారం ప్రకటించింది. బలమైన వృద్ధితో పాటు విదేశీ నిధులు భారీగా తరలి వస్తుండటం రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించేందుకు...
ట్రంప్ సుంకాల ప్రభావం అంతంతే
ఫిచ్ రేటింగ్
న్యూఢిల్లీ: భారత సార్వభౌమ పరపతి రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ రేటింగ్ సోమవారం ప్రకటించింది. బలమైన వృద్ధితో పాటు విదేశీ నిధులు భారీగా తరలి వస్తుండటం రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించేందుకు దోహదపడ్డాయని తెలిపింది. ఈ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఇండియాకు గతంలో స్థిరమైన వైఖరితో కూడిన ‘బీబీబీ మైనస్’ రేటింగ్‌ను కేటాయించింది. పెట్టుబడులకు అనుకూలమైన కనిష్ఠ రేటింగ్ ఇది. కాగా, మరో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ ఈ మధ్యనే భారత పరపతి రేటింగ్‌ను బీబీబీ స్థాయికి పెంచింది. కాగా దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రతిపాదిత 50 శాతం సుంకాల ప్రభావం అంతంత మాత్రమేనని ఫిచ్ అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి