EU Russia Sanctions: రష్యాపై ఈయూ మరిన్ని ఆంక్షలు
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:53 AM
బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఈయూ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాయి..
బ్రస్సెల్స్ (బెల్జియం): బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా రష్యా ఎగుమతి చేసే బ్యారల్ చమురు గరిష్ఠ ధరను ప్రస్తుత 60 డాలర్ల నుంచి 45 డాలర్లకు కుదించాయి. ఏ దేశమైనా రష్యా చమురుకు ఇంత కంటే ఎక్కువ చెల్లిస్తే ఆ దేశాలపైనా ఆంక్షలు తప్పవని హెచ్చరించాయి. దీనికి తోడు రష్యా చమురుతో ఉత్పత్తి చేసే పెట్రోల్, డీజిల్ దిగుమతులనూ నిషేధించాయి. దీంతో భారత్‌లో రష్యా చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్ నిర్వహణలోనినయారా ఎనర్జీపైనా ఈ ప్రభావం పడనుంది. మరోవైపు రష్యా బ్యాంకులతో లావాదేవీలపైనా బ్రిటన్, ఈయూ మరిన్ని ఆంక్షలు విధించాయి. అయితే ఈ బెదిరింపులు తమను ఏమీ చేయలేవని రష్యా స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి