Share News

Business Ideas For Women: ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:55 PM

Small Business Ideas For Women: ఇంటి నుంచే వ్యాపారం చేయాలనే ఆశయం మీకుందా.. ఈ ఒక్క మెషీన్ కొనుక్కుంటే చాలు. తర్వాత పైసా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. కేవలం ఈ మెషీన్ సాయంతోనే రోజుకు రూ.5000 వేలు అంటే నెలకు లక్షన్నర పైనే సంపాదించవచ్చు. మరి, ఆ బిజినెస్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Business Ideas For Women: ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..
Embroidery Business for Women

Small Business Ideas For Women: ఇంట్లో పనికి ఆటంకం కలగకుండా మిగిలిన కాస్త ఖాళీ సమయంలోనే డబ్బు సంపాదించే అవకాశం కోసం మీరు అన్వేషిస్తుంటే.. ఇదొక మంచి ఛాన్స్. నిజానికి రోజులో రెండు లేదా మూడు గంటలు పనిచేస్తే వచ్చే సంపాదన చాలా తక్కువ. చేయాల్సిన శ్రమేమో ఎక్కువ. మహిళలు అదే సమయాన్ని ఈ బిజినెస్‌ కోసం వెచ్చిస్తే ఊహించిన దాని కన్నా ఎక్కువే సంపాదించవచ్చు. ఇందుకోసం కేవలం ఒకే ఒక్కసారి మెషీన్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్ట్ చేయాలంతే. ఇంటి దగ్గర ఉంటూనే రోజుకు రూ.5వేల ఆదాయం పొందవచ్చు. ఇదెలా సాధ్యమని ఆలోచిస్తున్నారా.. అదెలాగో ఇప్పుడు మీకు మేం వివరంగా చెప్తాం.


ఇండియాలో ఆల్ టైం టాప్ బిజినెస్..

ఎల్లప్పుడూ మార్కెట్లో డిమాండ్ వ్యాపారాల్లో కొన్నింటిని వరసబెట్టి చెప్పమని అడిగితే.. అందులో తప్పకుండా వస్త్ర వ్యాపారం ఉండి తీరుతుంది. ఎందుకంటే మనదేశంలో దాదాపు చాలామంది నెలకు కనీసం రెండు సార్లైనా తప్పక బట్టలు కొనుక్కుంటారు. ఇక ఏడాది పొడుగునా పండగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండనే ఉంటాయి. అందుకని తప్పక కొత్త బట్టలు కొనుక్కుంటారు మహిళలు. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తారు. ఎంత ఖరీదైన చీరలు కొన్నా తప్పక బ్లౌజు కుట్టించుకోవాల్సిందే. ఫంక్షన్లలో గ్రాండ్‌ లుక్ కోసం మహిళలు బ్లౌజులపై ఎంబ్రాయిడరీలు వేయించుకోవడం సర్వసాధారణం.ఇక టీనేజీ అమ్మాయిలైతే లెహంగాలు, హాఫ్ శారీలపైనా వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నచ్చిన మెటీరియల్‌ ఎంచుకుని కావాల్సిన డిజైన్ వేయించుకునే వెసులుబాటు ఉండటం వల్లే ఎంబ్రాయిడరీ బిజినెస్‌ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. నేరుగా ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తుల ఖరీదు అధికంగా ఉండటమూ కూడా సామాన్య మహిళలు ఈ ఆప్షన్ ఎంచుకోవడానికి గల మరో కారణం.


చేతితో ఎంబ్రాయిడరీ చేసుకోవడం మహిళలకు స్వతహాగానే ఆసక్తి ఉంటుంది. ఇందుకోసం సాంప్రదాయ మగ్గం వర్క్ నేర్చుకున్నా ఎక్కువమంది సాయం అవసరం అవుతుంది. అధిక సమయం కేటాయిస్తే గానీ అనుకున్న టైంకి పని పూర్తిచేయలేం. అదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషీన్‌తో అయితే అతి తక్కువ సమయంలోనే అందమైన డిజైన్లను వేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఎంత వేగంగా, మన్నికతో పని పూర్తి చేస్తే అంత ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. నిజానికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ కొనుగోలు కాస్త ఎక్కువే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే అన్ని వ్యాపారాల్లోలాగా ప్రతిసారి పెట్టుబడి పెట్టాల్సిన పని ఉండదు. ఈ వ్యాపారంలో రాణించేందుకు ఏం చేయలి.. పెట్టుబడి.. లాభాలు.. తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


పెట్టుబడి : మార్కెట్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ల ప్రారంభ ధర కనీసం రూ.90వేల నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకూ దొరుకుతాయి. 8 నీడిల్స్, 15 నీడిల్స్ ఉన్న మెషీన్ల ధర రూ.2-రూ.4లక్షల వరకూ ఉంటుంది. ఎంబ్రాయిడరీ హూప్స్, థ్రెడ్‌లు, ఫ్యాబ్రిక్, కత్తెర, సూదులు తదితర పరికరాల ఖర్చు రూ.2 వేలు మించదు. మొత్తంగా కనీస పెట్టుబడి లక్ష.

లాభం : మార్కెట్లో ప్రస్తుతం ఎంబ్రాయిడరీ చేసిన ప్రతి బ్లౌజ్‌కు కనీసం రూ.1000లు తీసుకుంటారు. ఆ లెక్కన మీరు రోజులో 5 బ్లౌజ్‌లు చేసినా చాలు. నెలకు ఈజీగా లక్షన్నర సంపాదించవచ్చు.

గమనిక : మీ ఆర్డర్ల డిమాండ్ ఎలా ఉందనే అంశం ఆధారంగా ఏ మెషీన్ కొనుగోలు చేయాలో ముందే నిర్ణయించుకోండి. కొన్నతర్వాత దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం.


Read Also : Business Idea : పెట్టుబడి పదివేలు.. రాబడి రూ.50వేలు.. మహిళలు ఇంటి

Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో ...

Business Plan : డబ్బుకు డబ్బు.. ఇంట్లోనే పని.. మహిళల కోసం బెస్ట్ ...

Updated Date - Mar 12 , 2025 | 01:59 PM