Share News

DMart Shopping Secrets: ఈ టైంలో డీమార్ట్‌లో షాపింగ్ చేస్తే ఊహించని డిస్కౌంట్లు..

ABN , Publish Date - Jul 09 , 2025 | 08:02 PM

డీమార్ట్‌లో కిరాణా వస్తువులు, బట్టలు, గృహోపకరణాలు ఇలా ప్రతిదీ మరెక్కడా లేని విధంగా అత్యంత చౌక ధరకు లభిస్తాయని అందరికీ తెలిసిందే. అయితే, చాలా మంది ఈ ఒక్క విషయంలో మాత్రం పొరపాటు పడతారు. DMartలో అన్ని రోజులూ వస్తువుల ధరలు ఒకేలా ఉన్నాయని అనుకుంటారు. కానీ, ఈ టైంలో షాపింగ్ చేసేవాళ్లకు భారీ డిస్కౌంట్లు లభిస్తాయని తెలుసా..

DMart Shopping Secrets: ఈ టైంలో డీమార్ట్‌లో షాపింగ్ చేస్తే ఊహించని డిస్కౌంట్లు..
Best Time to Shop at Dmart

Best Time to Shop at Dmart: ఒకసారి వెళితే మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్లి షాపింగ్ చేయాలి అనిపించే చోటు డీమార్ట్. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎమ్మార్పీ కంటే అతి తక్కువ ధరకు గుండుసూది మొదలుకుని ఒక కుటుంబానికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులను ఒకే గొడుగు కింద అందిస్తున్న ఏకైక సంస్థ ఇదే. నాణ్యమైన వస్తువులను చౌక ధరకే అందిస్తూ కోట్లాది మంది భారతీయుల మనసులను దోచుకుంది. తన పర్మినెంట్ కస్టమర్లుగా మార్చేసుకుంది. అందుకే వారాంతాలు లేదా సెలవులు వచ్చాయంటే చాలు.. ఏ డీమార్ట్ బ్రాంచ్ అయినా జనాలతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. అయితే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, DMartలో అన్ని రోజులూ వస్తువుల ధరలు ఒకేలా ఉండవు. మరి, డీమార్ట్‌లో షాపింగ్ చేసేందుకు బెస్ట్ టైం ఏదో తెలుసుకుందామా...


వీకెండ్ డిస్కౌంట్స్

డీమార్ట్‌లో వారాంతాల్లో అంటే శుక్రవారం నుంచి ఆదివారం మధ్య వస్తువులు భారీ డిస్కాంట్లకు లభిస్తాయి. ఈ సమయాల్లో ఎక్కువగా కిరాణా వస్తువులు, దుస్తులు, పర్సనల్ కేర్‌కు సంబంధించిన ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపు ఉంటుంది. తరచూ 'బై వన్ గెట్ వన్' తరహా ఆఫర్లు కస్టమర్లను ఊరిస్తుంటాయి. ఈ సమయంలో షాపింగ్ చేస్తే తక్కువ డబ్బుతో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయవచ్చు.


క్లీన్-అప్ సేల్

దీని గురించి అందరికీ పెద్దగా అవగాహన ఉండదు. ఎందుకంటే, సోమవారం నాడు అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతారు. పెద్దగా షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపరు. కానీ, ఈ రోజున డీమార్ట్ స్టోర్లు 'క్లీన్-అప్ సేల్' నిర్వహిస్తాయి. వారాంతాల్లో మిగిలిపోయిన స్టాక్‌ను వేగంగా అమ్మడమే ఈ ఆఫర్ ఉద్దేశం. అందుకే వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తారు. అయితే, ఈ సేల్ అన్ని బ్రాంచీల్లో ప్రతిసారీ అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి, మీకు దగ్గర్లో ఉన్న డీమార్ట్ వద్ద ఎప్పుడు క్లీన్-అప్ సేల్ నిర్వహిస్తారో చెక్ చేసుకుంటే మీ డబ్బు ఆదా అవుతుంది.


పండగ, సీజనల్ సేల్స్

దసరా, దీపావళి, హోళీ, క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలా పండగలతో పాటు సమ్మర్, మాన్ సూన్, వింటర్ అంటూ కాలానుగుణంగా సంవత్సరంలో పలుమార్లు ప్రత్యేక సేల్స్ ద్వారా సాధారణ రోజుల్లో కంటే అదనపు తగ్గింపులకు వస్తువులను అమ్ముతుంటుంది డీమార్ట్.


డీమార్ట్ రెడీ యాప్

డీమార్ట్ ఆన్‌లైన్ యాప్ ద్వారా కొనుగోళ్లు చేసేవారికి సోమవారం లేదా బుధవారం సమయాల్లో ఆన్‌లైన్-ఎక్స్‌క్లూజివ్ డీల్స్ లేదా కూపన్లు అందుబాటులో ఉంటాయి. తరచూ చెక్ చేసుకుంటూ ఉంటే భారీ డిస్కౌంట్లతో వస్తువులను కొనుక్కునేందుకు ఛాన్సుంది. ఈ ఆఫర్లు కేవలం కేవలం ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకే లభిస్తాయి.


ఇవి కూడా చదవండి

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 08:05 PM