Share News

దివీస్‌ లాభంలో 23శాతం వృద్ధి

ABN , Publish Date - May 18 , 2025 | 01:51 AM

దివీస్‌ లేబొరేటరీస్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.662 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం...

దివీస్‌ లాభంలో 23శాతం వృద్ధి

క్యూ4లో రూ.662 కోట్లు

ఒక్కో షేరుకు రూ.30 డివిడెండ్‌

దివీస్‌ లేబొరేటరీస్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.662 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 23 శాతం, ఆదాయం 12 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో ఫారెక్స్‌ లాభాలు రూ.10 కోట్లుగా ఉన్నట్లు దివీస్‌ పేర్కొంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.9,712 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.2,191 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో ఫారెక్స్‌ లాభాలు రూ.30 కోట్ల నుంచి రూ.48 కోట్లకు పెరిగాయని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.30 (1,500 శాతం) డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

ఇవి కూడా చదవండి

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 01:51 AM