Share News

DelhiVery: చిన్నగా మొదలైన కంపెనీ..ఇప్పుడు రూ.1400 కోట్లతో మరో సంస్థని కొనుగోలు..

ABN , Publish Date - Apr 05 , 2025 | 09:19 PM

ప్రముఖ సంస్థలకు పోటీగా చిన్నగా మొదలైన లాజిస్టిక్స్ కంపెనీ ఢిల్లీవరీ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.1407 కోట్లకు మరో సంస్థను కోనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

DelhiVery: చిన్నగా మొదలైన కంపెనీ..ఇప్పుడు రూ.1400 కోట్లతో మరో సంస్థని కొనుగోలు..
DelhiVery Acquires Ecom Express

2011లో చిన్నగా 50 వేల రూపాయలతో మొదలైన లాజిస్టిక్స్ కంపెనీ ఢిల్లీవరీ(DelhiVery).. ఇప్పుడు వేల కోట్ల వ్యాపార స్థాయికి చేరుకుంది. అంతేకాదు తన ప్రత్యర్థి సంస్థ అయిన ఇకామ్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌(Ecom Express Limited)ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ కొనుగోలు విలువ దాదాపు రూ.1,407 కోట్లు అవుతుంది. ఈ క్రమంలో నగదుకు తన వాటాదారుల నుంచి ఇకామ్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసినట్లు ఢిల్లీవరీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఢిల్లీవేరీ లిమిటెడ్ బోర్డు ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈకామ్ ఎక్స్‌ప్రెస్, దాని వాటాదారుల మధ్య షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ అమలు, ఇతర అవసరమైన పత్రాలను బోర్డు ఆమోదించింది.


ఆమోదానికి లోబడి

ఈ కొనుగోలు పూర్తయిన తర్వాత, నియంత్రణా ఆమోదాలు, సాధారణ ముగింపు షరతులు నెరవేరితే, Ecom ఎక్స్‌ప్రెస్ Delhivery అనుబంధ సంస్థగా మారుతుంది. శనివారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీవరీ కంపెనీ మార్కెట్ విలువ రూ.1,664,44,00,710గా ఉంది. ఈ డీల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదానికి లోబడి ఉంటుంది. వాటా కొనుగోలు ఒప్పందం అమలు నుంచి ఆరు నెలల్లోపు కొనుగోలును పూర్తి చేయాలని ఢిల్లీవరీ ఆశిస్తోంది. అయితే ఈ కాలక్రమాన్ని పరస్పర అంగీకారం ద్వారా పొడిగించుకోవచ్చు. ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 99.4 శాతం వాటాను గరిష్టంగా రూ.1,407 కోట్లకు కొనుగోలు చేయడానికి ఢిల్లీవరీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


రెండు కంపెనీలు

ఈ కొనుగోలుపై లాజిస్టిక్స్‌ రంగంలో నిరంతర మెరుగుదల అవసరమని ఢిల్లీవరీ మేనేజింగ్ డైరెక్టర్, CEO సాహిల్ బారువా అన్నారు. ఈ కొనుగోలు ద్వారా మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నెట్‌వర్క్, పెట్టుబడుల ద్వారా తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు కంపెనీలు ఒక్కటి కావడం వల్ల భారతదేశం అంతటా లాజిస్టిక్స్ పరిశ్రమకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థాపకులు సత్యనారాయణన్ అన్నారు.


ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ఆర్థిక నివేదికలు

ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 2012లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఇది హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉంది. ఇది టెక్-ఎనేబుల్డ్ ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్స్ సర్వీసెస్ కంపెనీ. నివేదికల ప్రకారం, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ టర్నోవర్ మార్చి 31, 2022 నాటికి రూ. 2,090 కోట్లు, 2023లో రూ. 2,548 కోట్లు, 2024లో రూ. 2,607 కోట్లుగా ఉంది. రూ. 2,400 కోట్ల అధీకృత వాటా మూలధనం రూ. 420.73 కోట్ల చెల్లించిన వాటా మూలధనంతో, ఎకామ్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ రంగంలో ఒక ముఖ్యమైన సంస్థగా ఉంది. ఈకామ్ ఎక్స్‌ప్రెస్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)లో షిప్‌మెంట్ వాల్యూమ్‌లు, లాభదాయకత, సామర్థ్య కొలమానాలను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ, గత సంవత్సరం ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌పై ఢిల్లీవరీ ఆరోపణలు చేసిన తర్వాత ఈ కొనుగోలు జరగడం విశేషం.


ఇవి కూడా చదవండి:

BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 09:20 PM