Share News

Commerical Gas Cylinder Price Hike: మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. ఏ మేరకు పెరిగిందంటే..

ABN , Publish Date - Mar 01 , 2025 | 02:17 PM

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. రూ. 6 మేరకు సిలిండర్ ధరను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచీ అమల్లోకి వచ్చాయి.

Commerical Gas Cylinder Price Hike: మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. ఏ మేరకు పెరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: జనాలపై గ్యాస్ భారం స్వల్పంగా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా ప్రకటించాయి.19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ.6 మేరకు పెంచినట్టు ప్రకటించారు. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ.1797 ఉండగా తాజా పెంపుతో ధర రూ.1803కు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి (Commercial LPG Price Hike).

గత ఐదేళ్లల్లో ఇంత స్వల్ప స్థాయిలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. మార్చి 2023లో ఏకంగా రూ.352 మేర ధరలు పెరిగాయి. ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం వాణిజ్య సిలిండర్‌ ధర రూ.7 మేర తగ్గించినట్టు పేర్కొన్నా తాజా పెంపుతో నాటి ప్రయోజనంలో కోత పడినట్టైంది.


Gold Rates Today: త్వరపడండి.. తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి టైం

ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా సమాచారం ప్రకారం, ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ తాజా ధర రూ.1803గా ఉంది. కోల్‌కతాలో రూ.1913, ముంబైలో రూ.1755, చెన్నైలో రూ.1965గా ఉంది.

డొమెస్టిక్ సిలిండర్ ధరలు యథాతథం

కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగినా గృహవినియోగ సిలిండర్‌ల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. వివిధ నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్‌ల ధరలు ఎలా ఉన్నాయంటే..

  • ఢిల్లీ - రూ.803,

  • కోల్‌కతా - రూ. 829,

  • ముంబై - రూ.802.50

  • చెన్నై-రూ.818.50

  • లఖ్నవూ - రూ.840.50 గా ఉన్నాయి.


Stock Market : మార్కెట్లకు ఫిబ్రవర్రీ

ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్‌ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెల నెల మార్పులు చేస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ, ప్రభుత్వ విధానాలు, పన్ను విధానంలో మార్పులు, డిమాండ్ సరఫరాల్లో సీజనల్ మార్పులు, భౌగోళిక రాజకీయ అంశాలు, ఆయిల్ కంపెనీలు ఖర్చులు ఆదాయం వంటి వాటి ఆధారంగా వాణిజ్యి సిలిండర్‌ల ధరల్లో కంపెనీలు మార్పులు చేస్తుంటాయి. అయితే, మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం సామాన్యులపై పడకుండా ప్రభుత్వం గృహవినియోగ సిలిండర్‌ల ధరలను నియంత్రిస్తుంది.

Read Latest and Business News

Updated Date - Mar 01 , 2025 | 02:17 PM