Gold Rates Today: త్వరపడండి.. తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి టైం
ABN , Publish Date - Mar 01 , 2025 | 07:31 AM
నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. దేశంలో మరోసారి బంగారం ధరలు తగ్గాయి. తాజా రేటు ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 84,450గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.79,590గా ఉంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా జువెలర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, మదుపర్ల లాభాల స్వీకరణ వంటి కారణాలతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక కిలో వెండి ప్రస్తుతం 94,230గా ఉంది (Gold rates today).
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవే (24 క్యారెట్)
హైదరాబాద్: రూ. 87,440,
విశాఖపట్నం: రూ.86,420
ఢిల్లీ: రూ. 84,150
అహ్మదాబాద్: రూ. 84,410
చెన్నై: రూ. 84,540
ముంబై: రూ. 84,300
కోల్‌కతా: రూ, 84,190
బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారన్న విషయం తెలిసిందే. 24 క్యారట్ల బంగారం అంటే 99.9 స్వచ్ఛమైనదని అర్థం. ఇక నగల తయారీకి వాడే 22 క్యారట్ల బంగారం స్వచ్ఛత 91.6 శాతం. జీఎస్‌టీ అమలుకు పూర్వం వివిధ రాష్ట్రాల్లో బంగారం మధ్య తేడాల్లో ఎక్కువగా ఉండేవి. ఆ తరువాత పన్ను విధానం సరళీకృతం కావడంతో వివిధ ప్రాంతాల మధ్య బంగారం ధరల్లో తేడాలు తగ్గాయి. అయితే, స్థానిక పరిస్థితులు, డిమాండ్ - సప్లై అంతరాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి.