PSU Bank Mergers: మరో విడత పీఎస్ బీల విలీనాలు
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:04 AM
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) మరో విడత విలీనాలకు కేంద్రం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆస్తుల విలువ పరంగా ప్రస్తుతం...
ఎస్‌బీఐ తరహాలో 3-4 మెగా బ్యాంకుల ఏర్పాటు ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం!!
నేటి నుంచి పీఎ్‌సబీల మేధోమధనం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) మరో విడత విలీనాలకు కేంద్రం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆస్తుల విలువ పరంగా ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ), హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ మాత్రమే ప్రపంచంలోని 100 అతిపెద్ద బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. వీటి తరహా లో మరో 3-4 మెగా పీఎ్‌సబీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈసారి విలీనాలను చేపట్టనున్నట్లు సమాచారం. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు దేశంలో మరిన్ని ప్రపం చ స్థాయి బ్యాంకుల ఏర్పాటు అవసరమని మోదీ సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12-13 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సారథులు, ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ అధికారులతో కేంద్రం నిర్వహించే రెండు రోజుల మేధోమధనం కార్యక్రమంలో పీఎ్‌సబీల మలి విడత విలీనాల ప్రతిపాదనపై చర్చ జరగనుందని వారన్నారు. చివరిసారి 2020లో మోదీ ప్రభుత్వం పీఎ్‌సబీల విలీనాలను జరిపింది. దీంతో పీఎ్‌సబీల సంఖ్య 27 నుంచి 12కు తగ్గింది. విలీనాల అంచనాల నేపథ్యంలో లిస్టెడ్ పీఎస్‌బీల షేర్లు గురువారం లాభాల్లో పయనించాయి. దాంతో బ్యాంక్ నిఫ్టీ దాదాపు ఒక శాతం పెరిగింది.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
For More National News and Telugu News