Share News

Cement Price Drop: రూ 35 తగ్గనున్న సిమెంట్‌ ధర

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:19 AM

జీఎస్‌టీ సంస్కరణలతో సిమెంట్‌ ధరలు దిగి రానున్నాయి. ఈ తగ్గింపు 50 కిలోల బస్తాపై రూ.30 నుంచి రూ.35 వరకు ఉంటుందని...

Cement Price Drop: రూ 35 తగ్గనున్న సిమెంట్‌ ధర

ఇండియా రేటింగ్స్‌

న్యూఢిల్లీ: జీఎస్‌టీ సంస్కరణలతో సిమెంట్‌ ధరలు దిగి రానున్నాయి. ఈ తగ్గింపు 50 కిలోల బస్తాపై రూ.30 నుంచి రూ.35 వరకు ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటైల్‌ మార్కెట్‌లో బస్తా సిమెంట్‌ ధర కంపెనీని బట్టి రూ.330 నుంచి రూ.370 వరకు పలుకుతోంది. జీఎ్‌సటీ ప్రయోజనాలను ఈ నెల 23 నుంచి వినియోగదారులకు బదిలీ చేయాలని కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రిటైల్‌ మార్కెట్‌లోనూ బస్తా సిమెంట్‌ ధర రూ.30 నుంచి రూ.35 వరకు తగ్గుతుందని అంచనా.

ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్

For More National News and Telugu News

Updated Date - Sep 11 , 2025 | 05:19 AM